• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా భవాని శంకర్ బాధ్యతలు

KKD: పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(పాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బీ.హెచ్. భవానీ శంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అనుసరిస్తూ ఈరోజు భవానీ శంకర్ పాడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

March 17, 2026 / 06:10 PM IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు.. సిలిండర్లు స్వాధీనం

NLG: చిట్యాల పట్టణంలోని హోటళ్లు, ధాబాలు, ఫాస్ట్ ఫుడ్, రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా వాడుతున్న 15 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 17, 2026 / 06:09 PM IST

రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అమలు

CTR: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇంద్రధనుస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు RTC డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుధవారం CM చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత పుంగనూరు ఆర్టీసీ బస్టాండులో ఉదయం 11 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.

March 17, 2026 / 06:08 PM IST

‘సర్కే చునార్‌’ సాంగ్‌.. తొలగించాలంటూ ప్రభుత్వం ఆదేశం

ధృవ సర్జా, రీష్మా ముఖ్యపాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం ‘కేడీ ది డెవిల్‌’. సంజయ్‌ దత్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘సర్కే చునార్‌’ పాట వివాదాల్లో చిక్కుకుంది. పాట సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయి. దీంతో అన్ని ఫ్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని కేంద్ర సమాచారశాఖ మంత్రిత్వశాఖ CBFCని ఆదేశించింది.

March 17, 2026 / 06:08 PM IST

గ్రామాల్లో పోలీసుల నిఘా పెంచాలి: డీసీపీ

RR: మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి కడ్తాల్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను, లాకప్‌ను పరిశీలించారు. కేసు నమోదు తీరు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పోలీసుల నిఘా పెంచాలన్నారు.

March 17, 2026 / 06:08 PM IST

హధీరాంజీ మఠం మహంత్‌గా అర్జున్ దాస్‌

TPT: తిరుపతి శ్రీస్వామి హధీరాంజీ మఠం మహంత్‌గా అర్జున్ దాస్‌కు మరోసారి అవకాశం లభించింది. ఈమేరకు రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాణిపాకం ఆలయంలో ఈవో పెంచల కిషోర్ నుంచి అర్జున్ దాస్ సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి.. అక్కడి నుంచి కాణిపాకం వస్తారు.

March 17, 2026 / 06:07 PM IST

నల్లబెల్లిలో గ్రామసభ- అభివృద్ధి పనులపై చర్చ

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. చెరువు కట్ట శుభ్రపరిచినట్లు, పారిశుధ్యం, వీధి దీపాలు, నీటి సరఫరాపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మరిన్ని పనులు చేపడతామన్నారు.

March 17, 2026 / 06:07 PM IST

గుంతకల్లు పట్టణ ప్రజలకు శుభవార్త.!

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నును ఒకే విడతలో చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 06:06 PM IST

గుంతకల్లు పట్టణ ప్రజలకు శుభవార్త.!

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నును ఒకే విడతలో చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 06:06 PM IST

ఈ ప్రాంతాల్లో కూల్.. కానీ..!

MDCL: మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిందని, కానీ ఉక్కపోత పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అల్వాల్ టెలిఫోన్ కాలనీ, మల్లాపూర్, కుషాయిగూడ ఓల్డ్ ఆఫీస్, కాప్రా, వినాయక నగర్, వివేకానంద నగర్, డాక్టర్ ఏఎస్ రావు నగర్ ఏరియాల్లో గత రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.

March 17, 2026 / 06:05 PM IST

నూతన డిస్కం.. అధికారుల డిప్యూటేషన్

HYD: తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్తగా TGRPDCL సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో TGNPDCL నుంచి 12 మంది అధికారులను HYDలోని TGRPDCLకు ఒక సంవత్సరం పాటు డిప్యూటేషన్‌‌పై పంపిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. సంస్థ ఏర్పాటు, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్‌వర్క్ విభజన, కార్యకలాపాల నిర్వహణ చేపట్టనున్నారు.

March 17, 2026 / 06:05 PM IST

ఉపాధ్యాయురాలు సరితకు డాక్టరేట్

SDPT: చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొరటికంటి సరిత డాక్టరేట్ సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ కె.భాస్కర్ పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను అధికారులు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేశారు. డాక్టరేట్ సాధించిన సరితను గ్రామమస్థులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

March 17, 2026 / 06:04 PM IST

గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం: కలెక్టర్

ADB: గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం అని అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామంలో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

March 17, 2026 / 06:04 PM IST

కాటారం మండలానికి 215 ఇళ్లు మంజూరు

BHPL: కాటారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొత్తం 215 గృహాలు మంజూరైనట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు వెల్లడించారు. ఈ ఇళ్లలో ప్రధానంగా కాటారం గ్రామానికి 150, ధన్వాడకు 48, చింతకానికి 23 చొప్పున కేటాయించారు. ఆదివారంపేట, చిద్నేపల్లి తదితర గ్రామాలకు 10 చొప్పున, ఆంకుసాపూర్, బయ్యారం వంటి పంచాయతీలకు 5 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.

March 17, 2026 / 06:03 PM IST

మహిళ సమాఖ్య కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన

ASF: తిర్యాణి మండల కేంద్రంలోని మహిళ సమాఖ్య కేంద్రం నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులు, ఇప్పటివరకు పూర్తి అయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా మహిళ సమాఖ్య కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

March 17, 2026 / 06:02 PM IST