• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భూదాన్ భూముల పేరుతో మోసం.. గ్యాంగ్ అరెస్ట్

KMM: వెలుగుమట్ల పరిధిలో భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. OPDR సభ్యులమని నమ్మించి బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల మూడు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశామని మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

March 17, 2026 / 06:02 PM IST

సూర్యుడి ఒడిలోకి నాసా ‘పార్కర్’ ప్రోబ్

అంతరిక్ష పరిశోధనల్లో నాసా మరో మైలురాయిని అధిగమించింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు పంపిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ విజయవంతంగా తన 27వ ‘క్లోజ్ అప్రోచ్’ను పూర్తి చేసింది. ఈ ప్రయాణంలో వ్యోమనౌక సూర్యుడి ఉపరితలానికి కేవలం 62 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది.

March 17, 2026 / 06:01 PM IST

‘సింగిల్ యూజ్ కవర్లతో పర్యావరణానికి నష్టం’

GDWL: సింగిల్ యూస్ కవర్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి విద్యుల్లత, ఎకో క్లబ్ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం MALD డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. డిస్పోజల్ కప్పులు, స్ట్రాలు వల్ల కాలుష్యం ఏర్పడుతుందన్నారు.

March 17, 2026 / 06:01 PM IST

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

KNR: మాధకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్‌గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 06:01 PM IST

‘మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత’

KNR: మాధకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్‌గా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 06:01 PM IST

దోమకొండకు నిధులు మంజూరు: సర్పంచ్

KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో దోమకొండ గ్రామానికి NREGS ద్వారా రూ.75 లక్షల మంజూరైనట్లు సర్పంచ్ ఐరెని నరసయ్య తెలిపారు. కాలేజీ వెళ్లే రోడ్డు రూ.10 లక్షలు, పోలీస్ స్టేషన్ వెళ్లే రోడ్డు రూ.15 లక్షలు, రైతు వేదిక రోడ్డు రూ. 20 లక్షలు, గుండ్ల చెరువు సమీపంలోని గురుకుల పాఠశాల రోడ్డుకి 30 లక్షలు మంజూరు అయినట్లు వివరించారు.

March 17, 2026 / 06:00 PM IST

అభివృద్ధి పనులపై ఫోకస్ పెంచాలి: కలెక్టర్

NGKL: రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

March 17, 2026 / 06:00 PM IST

ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ కింద వాహనం పంపిణీ

KRNL: ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ కింద 45 శాతం సబ్సిడీతో అందిస్తున్న TATA V-50 వాహనాన్ని ఇవాళ ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నాగరాజుకు అందజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. SC/ST వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను వినియోగించుకోవాలని యువతకు సూచించారు.

March 17, 2026 / 06:00 PM IST

‘సమయానికి సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలి’

ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరం ఉన్న ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఏ విధంగాను లేదని తెలిపారు.

March 17, 2026 / 06:00 PM IST

రంజాన్‌లో రక్తదానం సేవలు

అన్నమయ్య: పవిత్ర రంజాన్ మాసంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రక్తదాన సేవలు కొనసాగిస్తోంది. పీలేరు ప్రాంతానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌కు అత్యవసరంగా A నెగటివ్ రక్తం అవసరమవడంతో డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో జాకీర్ అనే యువకుడు వెంటనే స్పందించి రక్తదానం చేశాడు. జాకీర్‌ను నిర్వాహకులు రియల్ హీరోగా అభినందించారు.

March 17, 2026 / 06:00 PM IST

‘కేంద్రీయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచి అదనపు సెక్షన్లు’

NZB: బోధన్, NZB కేంద్రీయ విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి అదనపు సెక్షన్లు మంజూరు అయ్యాయని MP అర్వింద్ ధర్మపురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ KVలో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు, NZB KVలో 3వ తరగతి నుంచి 5వ తరగతులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం (సైన్స్) కి సైతం అనుమతి లభించిందన్నారు.

March 17, 2026 / 06:00 PM IST

రైతులకు అండగా నిలవడమే వారోత్సవాల లక్ష్యం

ELR: కొయ్యలగూడెం(మం) దిప్పకాయలపాడు గ్రామంలో మంగళవారం ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలవడమే ఈ వారోత్సవాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులకు అందుతున్న పథకాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 06:00 PM IST

‘ఆత్మరక్షణకు దోహదపడే కరాటే శిక్షణ పొందాలి’

MBNR: ఆత్మరక్షణకు దోహదపడే కరాటే శిక్షణ ప్రతి ఒక్కరు పొంది ఉండాలని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి సూచించారు. MBNR మాస్టర్ షాటో ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం కరాటే విద్యార్థులకు గ్రేడింగ్ బెల్టులు, ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కరాటే విద్య నేర్చుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం పొందుతామన్నారు.

March 17, 2026 / 06:00 PM IST

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం: కలెక్టర్

SRPT: హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం ఆయన కాలనీలోని రోడ్లు, హెలిప్యాడ్, సభాస్థలి పనులను పరిశీలించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు.

March 17, 2026 / 06:00 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

March 17, 2026 / 06:00 PM IST