• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామపంచాయతీని తనిఖీ చేసిన కలెక్టర్

HNK: నడికూడ మండలంలోని కంఠాత్మకూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 01:43 PM IST

ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తి

AKP: కోటవురట్ల మండలంలో ఈ నెలాఖరు నాటికి 5.73 లక్షల పని దినాలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఉపాధి హామీ పథకం ఏపీవో నాగరాజు మంగళవారం తెలిపారు. ఇప్పటివరకు 5.53 లక్షల పని దినాలను పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరులోగా 20వేల పని దినాలను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 01:43 PM IST

కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం ఉండొద్దని ఇండియన్ ఆయిల్ (IOCL) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు. పాత నంబర్లు కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది.

March 17, 2026 / 01:43 PM IST

టైక్వాండో క్రీడాకారులకు కలర్ ప్రమోషన్, బెల్ట్ అవార్డ్స్

NZB: జిల్లా అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్, బెల్ట్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. టైక్వాండో వంటి క్రీడల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

March 17, 2026 / 01:40 PM IST

లీవ్ ఇవ్వలేదని మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీతం పెంచలేదని.. లీవ్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్‌పై గార్డ్ కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన బ్యాంక్ మేనేజర్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గార్డ్ రవీంద్ర హుడా, అతడి సహచరుడు శిశుపాల్‌ను అరెస్ట్ చేశారు. గాజియాబాద్‌లోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.

March 17, 2026 / 01:38 PM IST

హంద్రీనీవా ద్వారా పెద్ద చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలు

CTR: పుంగనూరు (M) మోదుగులపల్లి పెద్ద చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణ జనాలను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ చెరువు ఆయకట్టు కింద అనుకుని ఉన్న భూమి రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:36 PM IST

కాబూల్ ఘటనపై క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన

కాబూల్‌లోని ఆసుపత్రిపై పాక్ జరిపిన దాడులపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పౌర గృహాలు, వైద్య మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరమని అన్నాడు. రంజాన్ మాసంలో సాటి మనుషులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి చేశాడు.

March 17, 2026 / 01:36 PM IST

సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

BDK: పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కార్పొరేటర్ మల్లెల స్వప్న కుమారి తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ మల్లెల స్వప్న కుమారి నేడు కార్పొరేషన్ కమిషనర్ సుజాతని కలసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

March 17, 2026 / 01:34 PM IST

‘రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ’

RR: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను మండల వ్యవసాయ అధికారి నిషాంత్ కుమార్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు.

March 17, 2026 / 01:34 PM IST

కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటా: ఎర్రబెల్లి

WGL: BRS పార్టీ కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటానని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామానికి చెందిన మంద ఉపేంద్ర ఇటీవల మరణించగా ఇవాళ వారి కుటుంబ సభ్యులను మాజీమంత్రి ఎర్రబెల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

March 17, 2026 / 01:34 PM IST

రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు

KMM: రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు విస్తృతంగా అందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం HYDలోని అసెంబ్లీలో తెలిపారు. ఒక కోటి 6 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లు అందించమన్నారు.

March 17, 2026 / 01:34 PM IST

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

E.G: తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో రైతన్నా-మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉందని, తద్వారా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 17, 2026 / 01:33 PM IST

రేణిగుంటలో మోసం చేసి దోపిడీ

TPT: రేణిగుంటలో ఆలయానికి తీసుకెళ్తామని నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసి దోపిడీ చేసిన ఘటన బయటపడింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఇద్దరు, అతన్ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బైక్, మొబైల్, నగదు, వెండి గొలుసు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 17, 2026 / 01:33 PM IST

మల్కాజ్‌గిరిలో ఆధార్ అప్‌డేట్ కష్టాలు..!

MDCL: మల్కాజ్‌గిరి పరిధి వినాయక నగర్, మల్కాజ్‌గిరి, గౌతమ్ నగర్, సైనిక్ పూరి ప్రాంతాల్లో ప్రజలకు ఆధార అప్‌డేట్ కష్టాలు తప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు వద్ద తెలంగాణగా మార్చుకోవడం కోసం అప్‌డేట్ చేసి నెలల సమయం గడుస్తున్నప్పటికీ అప్‌డేట్ కావడం లేదని, అనేక మందికి క్యాన్సిల్ అవుతుందని, దీంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు అక్కడి ప్రజలు వాపోయారు.

March 17, 2026 / 01:32 PM IST

రాజకీయ జీవితంపై జీవన్‌రెడ్డి కీలక ప్రకటన

TG: ఇప్పటివరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని.. ఉండాలనే కోరుకుంటున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కానీ ఈ బంధం తెగిపోతే ఎవరేం చేయలేరు. నేను ఎక్కడ ఉన్నా అంకిత భావంతో పని చేస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబద్దంగా తీసుకుంటాను. పార్టీ వీడాలనే ఆలోచన ఏర్పడడానికి కారణం ఎమ్మెల్యే సంజయ్. ఉగాది తర్వాత మరోసారి మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు.

March 17, 2026 / 01:32 PM IST