TG: ఇప్పటివరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. ఉండాలనే కోరుకుంటున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కానీ ఈ బంధం తెగిపోతే ఎవరేం చేయలేరు. నేను ఎక్కడ ఉన్నా అంకిత భావంతో పని చేస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబద్దంగా తీసుకుంటాను. పార్టీ వీడాలనే ఆలోచన ఏర్పడడానికి కారణం ఎమ్మెల్యే సంజయ్. ఉగాది తర్వాత మరోసారి మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు.