కాబూల్‌లోని ఆసుపత్రిపై పాక్ జరిపిన దాడులపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పౌర గృహాలు, వైద్య మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరమని అన్నాడు. రంజాన్ మాసంలో సాటి మనుషులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి చేశాడు.