SKLM: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రామును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాము ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.