NGKL: జిల్లా అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.