పవన్ కళ్యాణ్, దేవ కట్టా కాంబోలో సినిమా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వాటిపై దేవ కట్టా స్పష్టతనిచ్చాడు. ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలియదు కానీ, పవన్‌తో పనిచేయడం తన కల అని పేర్కొన్నాడు. తమకి ఏదైనా కథ నచ్చితే కచ్చితంగా సినిమా చేస్తామన్నాడు. ప్రస్తుతం తాను రాజకీయాలకు సంబంధం లేని ఒక విభిన్నమైన కథపై వర్క్ చేస్తున్నానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు.