VZM: మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వంగర మండలంలో జరిగింది. ASI ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్దానిక శివ్వాంలో నివాసముంటున్న కొక్కిరిగడ్డ గణేష్ (32) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై మతిస్థిమితం లేనట్లు ప్రవర్తిస్తున్నాడని తల్లి దుర్గమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.