KMM: ముదిగొండ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో ‘యువ మండల్ వికాస్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రజ్వల యువజన సంఘం అధ్యక్షులు చింతమాల పాపయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముదిగొండ, మధిర, కూసుమంచి, సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరు మండలాల్లోని యువతకు మై భారత్ పోర్టల్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.