NLG: రంజాన్ మాసం ప్రేమ, సహనం, సేవా భావానికి ప్రతీక అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నకిరేకల్ పట్టణంలోని ఇస్లాంపూరం గ్రామం మసీదు వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆయనతో ఉన్నారు.