AP: TTD చైర్మన్ BR నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మాజీ MLA కాటసాని ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన చేపట్టారు. మహిళతో అభ్యంతరకరంగా దొరికిపోయిన వ్యక్తిని TTD చైర్మన్ పదవిలో ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అలాగే YCP నేతలపై దాడులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.