నల్లగొండలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా దావతే ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, యువత సన్మార్గంలో నడవాలని కోరారు. రంజాన్ ప్రేమ, ఐక్యతలకు ప్రతీక అని కలెక్టర్ పేర్కొన్నారు.