GDWL: విద్యార్థుల మధ్య పోటీలు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి అని గట్టు మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గట్టు మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఎంపీపీఎస్ బల్గేరా (హరిజనవాడ) ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. ఈ సందర్భంగా అతన్ని అందరూ అభినందించారు.