KMM: చింతకాని, బోనకల్, మధిరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ రమణ మంగళవారం తనిఖీ చేశారు. టీకాల నిల్వ ఉష్ణోగ్రతలు, రికార్డులను పరిశీలించి కోల్డ్ చైన్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మధిర ఆసుపత్రిలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకా వేయించాలని కోరారు.