SDPT: కుకునూరుపల్లి మండలం లకుడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి గదిని సందర్శించి, పరీక్షల సమయంలో సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.