AP: బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. ఈ పర్యటన నేపథ్యంలో టీడీపీ నాయకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం సూరేపల్లె హెలిప్యాడ్ నుంచి అమరావతికి బయల్దేరారు.