MLG: వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్‌కు మంత్రి సీతక్క హాజరు కానున్నారు. వెంకటాపురం, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాల ప్రజలు పాల్గొని వారి సమస్యలు, పథకాల విన్నపాలు నేరుగా తెలుపవచ్చని కలెక్టర్ దివాకర్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.