SRCL: పేదల విద్య అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.