• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ సర్వేయర్

AP: తాడేపల్లిగూడెంలో మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద రూ.50 వేలు డిమాండ్ చేయగా.. యజమాని నగదు ఇస్తుండగా రామకృష్ణ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. రామకృష్ణ మున్సిపల్ సర్వేయర్, ఇన్‌ఛార్జి డివిజినల్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.

March 17, 2026 / 12:32 PM IST

కురవిలో ఖాళీ సిలిండర్లతో నిరసన..

MHBD: కురవిలో ఖాళీ సిలిండర్లతో CPI పార్టీ నేతలు నిరసన చేపట్టారు. CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ వైఫల్యం వల్లనే గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయని, భారతదేశంలోని ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 12:31 PM IST

శివాజీ జంక్షన్‌ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఛైర్మన్

HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేట వద్ద శివాజీ జంక్షన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ అన్నారు. రాజీపేట వద్ద శివాజీ విగ్రహ మరమ్మత్తు పనులు, జంక్షన్‌ను అధికారులతో కలిసి ఛైర్మన్ పరిశీలించారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.

రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు

ప్రకాశం: రహదారులపై ఆటోలు నడిపేవారు ఆర్టీవో నిబంధనలను పాటించాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య అన్నారు. మంగళవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఆటో నడిపేవారు యూనిఫామ్ కచ్చితంగా ధరించాలి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని సూచించారు.

March 17, 2026 / 12:30 PM IST

‘వడ్లు కొనలేం.. వరి పంట సాగు చేయడం బంద్ చేయండి’

KMM: వడ్లు కొనలేమని వరి పంట సాగు చేయడం బంద్ చేయాలని మంగళవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. వడ్లు కొనుగోలు చేయబోమని ఇకపై రైతులు మీ ఇష్టం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తుందని వెల్లడించారు. మరీ వేస్తే నీటి సమస్య కూడా ఏర్పడుతుందని అయితే అర్థం చేసుకోవాలని సూచించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

AKP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ మునగపాకలో ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో పాల్గొన్నారు. పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారన్నారు.

March 17, 2026 / 12:29 PM IST

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: MEO

VZM: వంగర మండలంలోని పాఠశాలలో ఒంటిపూట బడుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎంఈవో గణేశ్ నాయుడు తెలిపారు. ఇవాళ ఎంఆర్‌సీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతాయన్నారు.

March 17, 2026 / 12:29 PM IST

‘రైతు భరోసాకు కొత్త రైతులు దరఖాస్తు చేసుకోండి’

MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు ‘రైతు భరోసా’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో సుజాత సూచించారు. మార్చి 25 లోపు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ వివరాలతో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 12:26 PM IST

ఊక దంపుడు ఉపన్యాసాలు చేయకండి: శ్రీధర్ బాబు

TG: ప్యూచర్ సిటీలో ఎకో సిస్టం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మహిళల సాధికారతపై మాజీమంత్రి KTR మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. బాధ్యతగల ప్రతిపక్షంలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైంది కాదు. ఊక దంపుడు ఉపన్యాసాలు చేయకుండా.. పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నిచండి సమాధానం ఇస్తాం. ఏ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

March 17, 2026 / 12:25 PM IST

పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే

SKLM: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కూర్చొని మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 12:24 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు పంపిణీ

PDPL: రామగిరి మండలం పన్నూర్‌లో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్ చిందం మహేష్ ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ మండల అధికారి డా. కళ్యాణి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవులు, గేదెలకు టీకాలు వేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు పశువులను వ్యాధుల నుంచి రక్షించేందుకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.

March 17, 2026 / 12:24 PM IST