AP: తాడేపల్లిగూడెంలో మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద రూ.50 వేలు డిమాండ్ చేయగా.. యజమాని నగదు ఇస్తుండగా రామకృష్ణ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. రామకృష్ణ మున్సిపల్ సర్వేయర్, ఇన్‌ఛార్జి డివిజినల్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.