• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టరేట్‌లో చెత్త గుట్టలు.. ప్రజలకు తీవ్ర అసౌకర్యం..!

గుంటూరు కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యం పూర్తిగా అదుపు తప్పింది. కార్యాలయాల నుంచి వచ్చిన చెత్త, వాడిన ప్లేట్లు ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఆవరణ చెత్తకుప్పలతో నిండిపోయింది. దీంతో దుర్వాసన తీవ్రంగా వ్యాపించి, పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుభ్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 17, 2026 / 11:19 AM IST

‘వేం నరేందర్ రెడ్డిని కలిసిన కేసముద్రం మున్సిపల్ ఛైర్మన్’

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం. నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్ భానోత్ సునీత వెంకన్నతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ భానోత్ సునీత వెంకన్నకు వేం. నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.

March 17, 2026 / 11:17 AM IST

రేపు శ్రీ సంపత్ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

VZM : స్థానిక నాగోజిపేట వద్దనున్న శ్రీ సంపత్ ఆంజనేయ స్వామి వారి ఆలయ 15వ వార్షికోత్సవం బుధవారం (రేపు) జరగనున్నట్లు ఆలయ ప్రతిష్టాపకులు ఇసరపు శేఖర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రేపు వేకువజాము నుంచి విశేషపూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధనకు భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు.

March 17, 2026 / 11:17 AM IST

పోలీసుల వాహనాన్నే ఎత్తుకెళ్లిన సైకో

CTR: గంగవరంలో ఇవాళ సైకో వీరంగం సృష్టించాడు. సైకో పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని అపహరించి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు అతనిని వెంబడించగా ఓ చెరువులో దూకాడు. ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని పట్టుకుని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

March 17, 2026 / 11:16 AM IST

తుమ్మలపల్లి బ్రహ్మోత్సవాల ఆదాయ వివరాలు

NLG: చండూరు మండలం తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొత్తం రూ.18,08,120 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు. కొబ్బరికాయల వేలం, లడ్డు, పులిహోర విక్రయాలు, పూజా టికెట్లు, హుండీలు, కళ్యాణం, రథోత్సవ కట్నాల ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

March 17, 2026 / 11:15 AM IST

పూర్వజన్మ సుకృతం: బీఆర్ నాయుడు

AP: తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శుద్ధి కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ఆనంద నిలయం నుంచి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణంతో శుద్ధి నిర్వహించామన్నారు.

March 17, 2026 / 11:15 AM IST

కేసీఆర్ డ్రగ్ టెస్ట్‌కు రావాలి: మహేష్ గౌడ్

TG: MLA కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ‘డ్రగ్ టెస్ట్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్‌కు రావాలి. ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్ టెస్ట్‌లో పాల్గొనాలి. ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది మీ నాయకులు కాదా? చట్టం అందరికీ సమానమే.. చర్యలు ఉంటాయి. ఎంత పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.

March 17, 2026 / 11:14 AM IST

‘పశువులకు ముందస్తు టీకాలు వేయించాలి’

ADB: తాంసిలోని కప్పర్లలో పశు వైద్య అధికారులు పశువులకు మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పశువులకు ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింలు, శ్రీనివాస్, రాకేష్, తదితరులున్నారు.

March 17, 2026 / 11:13 AM IST

విద్యార్ధులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించండి: ఎమ్మెల్యే

E.G: విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌతమీ జీవకారుణ్య సంఘం పాలక మండలి సభ్యులకు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం రాజమండ్రిలో గౌతమీ జీవకారుణ్య సంఘం వద్ద వసతి గదిని MLA ప్రారంభించారు. నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం పుష్కర నిధుల నుంచి రూ.2.80 కోట్లు మంజూరు చేసిందన్నారు.

March 17, 2026 / 11:13 AM IST

మంగళ రూపిని అలంకారంలో శ్రీ వీరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లకు పంచామృతములతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సింధూరం, కుంకుమ, పసుపు, వివిధ పుష్పాలతో మంగళ రూపినిగా అలంకరించి పూజలు చేశారు.

March 17, 2026 / 11:13 AM IST

దగ్ధమైన ఇంటిని పరిశీలించిన మాజీ ఛైర్మన్

MLG: వాజేడు మండలం పెరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లారంలో నిన్న ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఇంటిని మాజీ జడ్పీ ఛైర్మన్ బడే నాగజ్యోతి పరిశీలించి బాధితరాలు రాధకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు. ఇల్లు దగ్ధమైన మహిళకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాగజ్యోతి కోరారు.

March 17, 2026 / 11:12 AM IST

మహిళా సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం: ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్

BHPL: మల్హర్ రావు మండలం కొయ్యూరు గ్రామంలో సోమవారం సాయంత్రం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

March 17, 2026 / 11:12 AM IST

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

TPT: రేణిగుంట(మం) ఆర్. మల్లవరం పంచాయతీలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతన్నలను కలిసి, వారితో మాట్లాడారు. సాగు నీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాపై రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 11:11 AM IST

డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

WNP: బీజేపీ నాయకులు దాసరాజు ప్రవీణును స్టేషన్‌కు పిలిపించి దాడి చేసిన ఘటనపై డీఎస్పీ వెంకటేశ్వరరావుకు జిల్లా అధ్యక్షులు డీ.నారాయణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై సురేంద్రబాబు, రెండవ ఎస్సై శశిధర్లు కలిసి తీవ్రంగా కొట్టడం జరిగిందని. పోలీసుల అధికరణతో చర్చలు జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

March 17, 2026 / 11:10 AM IST

డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

WNP: బీజేపీ నాయకులు దాసరాజు ప్రవీణును స్టేషన్‌కు పిలిపించి దాడి చేసిన ఘటనపై డీఎస్పీ వెంకటేశ్వరరావుకు జిల్లా అధ్యక్షులు డీ.నారాయణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై సురేంద్రబాబు, రెండవ ఎస్సై శశిధర్లు కలిసి తీవ్రంగా కొట్టడం జరిగిందని. పోలీసుల అధికరణతో చర్చలు జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

March 17, 2026 / 11:10 AM IST