AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పెద్దపులి కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బవురువాక సమీపంలోని కొండకు పెద్దపులి చేరిందని పేర్కొన్నారు. శంఖవరం మండలం జి కొత్తపల్లి నుంచి బవురువాకకు వచ్చిందన్నారు. బవురువాక, తాడువాయి వైపు వెళ్తే నర్సీపట్నం మీదుగా అడవిలోకి వెళ్లే అవకాశం ఉంది. పెద్దపులిని పట్టుకునేందుకు 11 హనుమాన్ బృందాలు గాలిస్తున్నాయి.
WGL: యుద్ధం కారణంగా పౌల్ట్రీ ఎగుమతులు తగ్గిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం రైతులు హోల్‌సేల్‌గా రూ. 7 చొప్పున అమ్మేవారు. వినియోగదారులకు రూ. 7.50కు లభించేవి. ప్రస్తుతం ఎగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ ధర రూ. 4.50కి దిగివచ్చింది. రిటైల్ మార్కెట్లో రూ. 5కు మాత్రమే లభిస్తున్నాయి.
AP: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రభావంతో పసుపు ధరలు భారీగా తగ్గాయి. క్వింటాల్ పసుపు ధర రూ.10-12 వేలు పలుకుతుంది. క్వింటాల్‌కు రూ.15 వేలు పలికితేనే గిట్టుబాటు ధర వస్తుందని అన్నదాతలు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గాయని వాపోయారు. సీజన్‌కు ముందే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం కాబోతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. అన్నా క్యాంటీన్ పూర్తయ్యాక ప్రతి రోజు వందలాది మంది పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.
అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీస్‌లో 109 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. బొంగైగావ్, గౌహతి రీజియన్‌లలో ట్రేడ్ అప్రెంటిస్/టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు మార్చి 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
SRD: సిర్గాపూర్ మండలంలోని రైతులకు రైతు భరోసా పథకంలో బ్యాంకు అకౌంట్ మార్చుకునే అవకాశం ఉందని ఎంఏవో హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో అకౌంట్ మార్పు చేయాలనుకునే రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. నేడు, రేపు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు రైతు భరోసా ఫారం, పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని పేర్కొన్నారు.
ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.
ASF: సింగరేణికి సంబంధించిన ప్రాపర్టీని దొంగిలించిన కేసులో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన చాపిడి మల్లేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. మల్లేశ్ ఆదివారం గోలేటి CHPకి చెందిన ఇనుప సామాగ్రి దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి కోర్టులో హాజరుపరిచామన్నారు.
CTR: సదుం మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. షబ్బీర్, గిరిబాబు తదితరులు ఉన్నారు.
PPM: ముస్లిం మైనారిటీలకు ఎల్లవేళలా అండగా నిలిచేది టీడీపీ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం జామియా మసీదులో సోమవారం జరిగిన ఇఫ్టార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎల్లపుడు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోరుతుందన్నారు.
MNCL: మంచిర్యాల ‘శుభ్రత-ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ డివిజన్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
CSK ప్లేయర్ ప్రశాంత్ వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి ధోనీని కలిసినప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకోలేదని, డబ్బు గురించి మాట్లాడుకున్నట్లు తెలిపాడు. IPL వేలం ద్వారా వచ్చిన డబ్బును వృథాగా ఖర్చు చేయొద్దని, పొదుపుపై దృష్టి సారించమని ధోనీ సలహా ఇచ్చినట్లు చెప్పాడు. ఈ అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్‌ను CSK రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది.
TG: డ్రగ్స్ వ్యవహారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో డ్రగ్స్, మద్యం టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డ్రగ్స్ టెస్ట్‌పై ప్రకటన చేసి పారిపోయారని ఆరోపించారు. కాగా, ఇటీవల బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
SKLM: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి ఉద్దానం ప్రాంత సమస్యలపై జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి కుటుంబానికి రక్షిత త్రాగునీరు అందించాలని కోరారు. అలాగే కొబ్బరి పంటకు సోకిన తెల్లదోమపై తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. లారీ డ్రైవర్‌తో పాటు యాజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.