• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయ లోక్ అదాలత్‌లో 740 కేసులు పరిష్కారం

MNCL: బెల్లంపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయింది. వివిధ కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. జడ్జి ముకేశ్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ సందర్బంగా బెల్లంపల్లి కోర్టులో 740 కేసులు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని అయన సూచించారు.

March 28, 2026 / 06:06 PM IST

యూరియా బుకింగ్ రద్దుకు డిమాండ్

KNR: వెన్నంపల్లి సహకార సంఘం మహాసభలో యూరియా బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ విధానంపై మహాసభలో తీర్మానం చేయాలని ఇన్‌ఛార్జ్ ఛైర్ పర్సన్ శ్రీనివాసులు సూచించారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి పాత విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు.

March 28, 2026 / 06:06 PM IST

‘అక్రమ రైస్ మిల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దు’

NRML: దిలావర్‌పూర్ గ్రామంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో నిర్మిస్తున్న రైస్ మిల్‌కు అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు MPO, సర్పంచ్, EO, ఉప సర్పంచ్‌లను శనివారం కోరారు. పరిసరాల్లో విద్యాసంస్థలు, నివాస గృహాలు, దేవాలయాలు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేష్ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

March 28, 2026 / 06:06 PM IST

BRS పార్టీలో చేరిన యుకే NRI నేతలు

RR: యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్, కొత్త సభ్యులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ సైతం పాల్గొన్నారు.

March 28, 2026 / 06:06 PM IST

వృద్ధులపై దాడి.. మనుమరాలి భర్తే నిందితుడు

MDK: చిన్న శంకరంపేట(M) జంగరాయిలో వృద్ధ దంపతులు సావిత్రమ్మ, అంజయ్యలపై దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సావిత్రమ్మ మనవరాలి భర్త కామారెడ్డి జిల్లా మాసన్ పల్లికి చెందిన వెంకటనారాయణ(40) ఈ దాడికి పాల్పడి దోచుకెళ్లినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

March 28, 2026 / 06:06 PM IST

‘బీసీ ఆత్మీయ సదస్సు జయప్రదం చేయాలి’

CTR: ఏప్రిల్ 19న తిరుపతిలో నిర్వహించనున్న బీసీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు‌లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో, బీసీల హక్కుల సాధనపై చర్చిస్తామన్నారు. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

March 28, 2026 / 06:06 PM IST

జూద స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్

BPT: యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలూరు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

March 28, 2026 / 06:05 PM IST

HYDలో 89 రకాల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్!

HYD: చెరువులు, నదులు, మురుగు కాలువల్లో శాస్త్రవేత్తలు ప్రమాదకరమైన బ్యాక్టీరియాను గుర్తించారు. వీటిలో 89 రకాల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ (ARGs) ఉన్నట్లు తేలింది. దీనివల్ల సాధారణ మందులు ఈ బ్యాక్టీరియాపై పనిచేయవు. కలుషిత నీరు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రజారోగ్యానికి తీవ్ర హెచ్చరిక అని పరిశోధకులు పేర్కొంటున్నారు.

March 28, 2026 / 06:04 PM IST

నల్ల బ్యాడ్జీలు ధరించి TBGKS నాయకుల నిరసన

ASF: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైరిగూడ ఓపెన్ కాస్ట్, ఏరియా వర్క్ షాప్, గోలేటి CHP, GM కార్యాలయాల వద్ద TBGKS నాయకులు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఏడాదిగా నిలిపివేసిన మెడికల్ బోర్డులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు.

March 28, 2026 / 06:04 PM IST

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయండి: సీపీఐ

NTR: విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన జరగగా.. ముఖ్య అతిథి జిల్లా కార్యదర్శి శంకర్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు పల్లెల్లో 3, పట్నంలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. జాప్యం లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలన్నారు.

March 28, 2026 / 06:03 PM IST

పీఎసీఎస్ సభ్యులకు ఆర్థిక సాయం.!

ELR: నూజివీడు పీఎసీఎస్ సభ్యులు మురళీకృష్ణ, భాస్కరరావు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు శనివారం పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పీఎసీఎస్ అధ్యక్షులు పసుపులేటి జగన్ మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ సభ్యులు, రైతుల పురోభివృద్ధి ద్యేయంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఎల్లవేళలా సభ్యులకు అండగా ఉంటామన్నారు. సీఈవో నీలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

March 28, 2026 / 06:02 PM IST

చినమల్లంలో వ్యవసాయ కళాశాల విద్యార్థుల పర్యటన

W.G: పెనుగొండ మండలం చినమల్లంలో రాజమండ్రి ఎన్.జీ. రంగ వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం పర్యటించారు. గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలను, పంట దిగుబడులను అడిగి తెలుసుకున్నారు. రసాయన పురుగుమందుల వాడకం తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.

March 28, 2026 / 06:02 PM IST

‘పప్పూరి సేవలు చిరస్మనీయం’

ATP: పుట్టపర్తి పప్పూరు నారాయణ ఆచార్యులు చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కీర్తిశేషులు నారాయణాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెసి మాట్లాడుతూ.. వీరు జాతికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమన్నారు.

March 28, 2026 / 06:02 PM IST

పెళ్లి పేరుతో మోసం.. ఆపై దాడి..!

VSP: విశాఖలో పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి, మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరుకు చెందిన రాహుల్ అనే వ్యక్తి తనపై దాడి చేసి, ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. బలవంతంగా గర్భస్రావం చేయించడమే కాకుండా ప్రాణహాని బెదిరింపులు చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

March 28, 2026 / 06:01 PM IST

‘పన్నులు చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలి’

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ఇంటి యజమానులు, వ్యాపారస్తులు అన్ని రకాల పన్నులను చెల్లించాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 31 ఆర్థిక సంవత్సరం మూడు రోజులలో ముగియనుందని తెలిపారు. అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటి, వ్యాపార, తదితర పన్నులను వసూలు చేస్తున్నారని, అందరూ సహకరించాలన్నారు.

March 28, 2026 / 06:00 PM IST