• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన DMHO

కృష్ణా: మచిలీపట్నంలోని ఎస్సీ హాస్టల్‌ను DMHO యుగంధర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, హాస్టల్ పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, ఆహార భద్రత ప్రమాణాలు, దోమల నివారణ చర్యలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా, పరిశుభ్రత సురక్షిత త్రాగునీరు, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆయన సూచించారు.

March 16, 2026 / 07:40 PM IST

సౌర శక్తితో వంట ఏర్పాటు చేయాలి: జేసీ

కోనసీమ: వాణిజ్య రంగానికి గ్యాస్ సరఫరా నిలిపివేయబడిన దృష్ట్యా దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నదానం, అక్షయపాత్ర, అన్నా క్యాంటీన్ల నిర్వహణలో గ్యాస్‌కి ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో వంట ఏర్పాట్లు చేసుకోవాలని జేసీ నిశాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌‌లో మున్సిపల్ కమిషనర్‌లు, దేవాదాయ శాఖ, నెడ్ క్యాప్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

March 16, 2026 / 07:40 PM IST

సౌర శక్తితో వంట ఏర్పాటు చేయాలి: జేసీ

కోనసీమ: వాణిజ్య రంగానికి గ్యాస్ సరఫరా నిలిపివేయబడిన దృష్ట్యా దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నదానం, అక్షయపాత్ర, అన్నా క్యాంటీన్ల నిర్వహణలో గ్యాస్‌కి ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో వంట ఏర్పాట్లు చేసుకోవాలని జేసీ నిశాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌‌లో మున్సిపల్ కమిషనర్‌లు, దేవాదాయ శాఖ, నెడ్ క్యాప్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

March 16, 2026 / 07:40 PM IST

రూరల్ స్పోర్ట్స్ మీట్స్ ప్రారంభం

PDPL: రామగుండం NTPC-TTS ఆవరణలో రూరల్ స్పోర్ట్స్ మీట్స్‌ను, GM ముకుల్ రాయ్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకే వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమాన్పూర్, అంతర్గాం, పాలకుర్తి, రామగుండం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

March 16, 2026 / 07:40 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి

AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు నక్కపల్లి వస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. భద్రతాపరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులని ఆదేశించారు.

March 16, 2026 / 07:40 PM IST

జిల్లా PGRSకు 241 అర్జీలు: కలెక్టర్

E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిర్వహించిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజల నుంచి 241 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 16, 2026 / 07:40 PM IST

తమన్ అందుకే ఈవెంట్‌కు రాలేదు: హరీష్ శంకర్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంగీత దర్శకుడు తమన్ రాలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ వివరించాడు. ఈ నెల 19న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, తమన్ రాత్రింబగళ్లు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిపాడు. స్టేజ్ మీద కనిపించడం కంటే, సినిమాకు మంచి అవుట్‌పుట్ ఇవ్వడమే ముఖ్యమని అన్నాడంటూ తమన్ సంస్కారాన్ని ప్రశంసించాడు.

March 16, 2026 / 07:40 PM IST

‘హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి’

ELR: ముసునూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. హెల్మెట్ ధారణ తలకు భారం కాదని, కుటుంబానికి రక్షణ కవచం అనే నిజాన్ని గుర్తించాలన్నారు. హెల్మెట్ లేని వాహన చోదకులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు.

March 16, 2026 / 07:39 PM IST

‘రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

WG: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు ఆరేటి వెంకట రత్నప్రసాద్ అన్నారు. కాళ్లకూరు సొసైటీ వద్ద రైతన్న మీకోసం వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. వ్యవసాయాన్ని సాంకేతిక విధానాలలో సాగుచేసి అధిక లాభాలు పొందాలని ఏవో పి. రమేష్ నాయుడు రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ ప్రణవమూర్తిరాజు, సర్పంచ్ సాదు శ్రీదేవి పాల్గొన్నారు.

March 16, 2026 / 07:39 PM IST

ఉచిత వైద్య శిబిరంలో 250 మందికి పరీక్షలు

హనుమకొండ జిల్లా వెలేరు మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి సోమవారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 250 మంది గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించగా, నిపుణులైన వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 16, 2026 / 07:38 PM IST

చిట్యాలలో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!

BHPL: చిట్యాలలో సోమవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు రెండు గ్రూపులుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. SI మధుసూదన్ ఆధ్వర్యంలో జడల్ పేట క్రాస్ వద్ద ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుళ్లు అస్లాం, సందీప్ పర్యవేక్షణలో ఇంకో ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ సదయ్య, రాజేష్‌పై కేసు నమోదు చేశారు.

March 16, 2026 / 07:37 PM IST

హిందూపురంలో ఉచిత పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ

సత్యసాయి: హిందూపురం పట్టణం 11వ వార్డు ప్రజలకు సోమవారం ఉచితంగా పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో వార్డు కౌన్సిలర్ అంజలి రమేశ్ రెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 07:35 PM IST

అమరజీవి పొట్టి శ్రీరాములకు వైసీపీ నివాళి

VSP: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిప్పల శ్రీనివాస్, మొల్లి అప్పారావు, కట్టుమురి సతీష్, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

March 16, 2026 / 07:32 PM IST

ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా. కవితారెడ్డి

NZB: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన డా. కవితారెడ్డి సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. NZB కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు జగడం సుమన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 07:32 PM IST

‘చంద్రబాబు రాజకీయ కుట్రలో పావు సునీత’

AP: సీఎం చంద్రబాబు రాజకీయ కుట్రలో పావు సునీత అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రపంచానికి తెలుసని అన్నారు. వివేకా హత్యతో జగన్, భారతికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జగన్‌తో వివేకానందరెడ్డికి అధికారం, ఆస్తి వివాదాలు లేవని చెప్పారు. చంద్రబాబు సునీత మనసులో విషవృక్షాన్ని నాటారంటూ మండిపడ్డారు.

March 16, 2026 / 07:31 PM IST