MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మహిళల ఖో-ఖో జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి 31 వరకు కర్ణాటకలో జరిగే సౌత్ జోన్ ఖో-ఖో టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు.
SRPT: మోతె మండలంలోని ఆన్నారిగూడెం గ్రామంలో ఇవ్వాళ ఉదయం అంకిరెడ్డి మల్లయ్య నివాసంలో అగ్నిప్రమాదం సంభవించి ఒక కారు, మోటార్ సైకిల్, ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితుడిని పరామర్శించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.
కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు 25వ నంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు స్పందించాలని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయం నందు ఇవాళ రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ కలెక్టర్ కీర్తి చేకూరిని కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి & ప్రజా సమస్యలను వినతి పత్రాల రూపంలో కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సమస్యలు ఇప్పటికే తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామీణ మౌలిక సదుపాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
KMM: ఖమ్మం 48వ డివిజన్‌కు రెండవ విడతలో భాగంగా పారిశుద్ధ్య పనుల కోసం నూతన ట్రాక్టర్‌ను కేటాయించారు. ఈ నూతన ట్రాక్టర్‌ను కార్పొరేటర్ తోట గోవిందమ్మ వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. విస్తారంగా ఉన్న 48వ డివిజన్‌లో చెత్తను నిర్మూలించడం కోసం ట్రాక్టర్ కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
NRML: DWOగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన గాజుల వినూత్నను సోమవారం స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వినూత్న హామీ ఇచ్చారు.
ప్రకాశం: సింగరాయకొండలో ఎస్సీ హాస్టల్ మరమ్మతు పనులను మంత్రి స్వామి సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీశారు. నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. పనులు జాప్యం జరగకుండా త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత ఉంటేనే విద్యార్థులకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు.
విశాఖపట్నం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో జరుగుతున్న VRCC డ్రైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ గుడివాడ అనూష పరిశీలించారు. విశాఖ డెయిరీ వెనుక జరుగుతున్న పనులను ఆమెతో పాటు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ పర్యవేక్షించారు. పనులు నాణ్యంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రంగా ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వర్షం కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయంగా మారడంతో స్థానికులు, వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
TG: గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమయం ఇవ్వలేదని.. భట్టి, జానారెడ్డికి కనీసం మైక్ ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. సభా చర్చల్లో మహిళా సభ్యుల పాల్గొనాలన్నారు. పూర్తి స్థాయిలో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
NTR: మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రూ.1.08 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో మైలవరం పట్టణంలో మూడు చోట్ల నిర్మించనున్న మూడు వెల్ నెస్ సెంటర్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ. 36 లక్షలు చొప్పున వెచ్చించనున్నారు.
MDK: తూప్రాన్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే చిన్నపాటి వడగళ్లతో కూడిన వర్షం పడింది. మల్కాపూర్ వద్ద ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో చెట్టు తొలగించే పనులు చేపట్టారు.
KMM: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లాడ మండలం గంగదేవి పాడు గ్రామానికి చెందిన సత్తెనపల్లి నరసయ్యకు విశ్వబ్రాహ్మణ సంఘం అండగా నిలిచింది. తల్లాడ మండల అధ్యక్షుడు నరసింహ చారి ఆధ్వర్యంలో సోమవారం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.16,116 రూపాయలను అందించారు. వ్యాధిగ్రస్తుడు అయిన నరసింహ చారి ఆ కుటుంబానికి భారం కాకూడదని సాయం అందించినట్లు వారు తెలిపారు.
W.G: భీమవరంలో ఇవాళ ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ శాఖ ద్వారా నిధులు కేటాయించి తగిన సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలోని ‘జనతా-వారధి’ జిల్లా కన్వీనర్ తోట గంగ రాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వరరాజు ప్రతినిధి బృందం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
TG: సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. సభకు ప్రిపేర్ అయి రావాలని, చిట్‍చాట్‍లు మానేయాలన్నారు. అనవసరమైన విషయాలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రులు ఎమ్మెల్యేల సమస్యలకు సమయం ఇవ్వాలని సూచించారు.