PPM : జిల్లాలో మార్చి16 నుంచి ఏప్రిల్1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 222 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ డ్రోన్‌లు,పెట్రోలింగ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
ప్రపంచ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో చంద్రిక పూజారి సత్తా చాటింది. మహిళల విభాగం ఫైనల్‌లో ఆమె (51 కేజీలు) స్వర్ణంతో మెరిసింది. మర్దొనోవా నజోఖత్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించింది. గుంజాన్ (48 కేజీలు), జోయ్‌శ్రీ దేవి (54), అంబేకర్ (50) ఫైనల్‌లో ఓటమిపాలయ్యారు. దీంతో వారంతా రజతంతో సరిపెట్టుకున్నారు. కాగా, ఇప్పటికే రాధామణి (57) కాంస్యం సాధించింది.
TPT: కోల్డ్ స్టోరేజ్ నిమ్మకాయలతో ధరలు పతనమవుతున్నాయి. కిలో నిమ్మ ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90 పలుకుతోంది. 2 నెలల కిందట గూడూరులో కిలో రూ.50లోపు ఉన్న సమయంలో వేల టన్నుల నిమ్మకాయలు గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజీలో వ్యాపారులు నిల్వ చేశారు. ధరలు పెరగడంతో వీటిని ఇప్పుడు దేశంలోని అన్ని మార్కెట్లలోకి డంప్ చేస్తున్నారు.
PLD: త్యాగానికి ప్రతీ రూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు చౌట శ్రీనివాసరావు అన్నారు. సత్తనపల్లి గాంధీ చౌక్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.
ASR: అనంతగిరి మండలంలో బొర్రా గుహలుకు వెళ్లే మార్గంలో గేటువలస వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన కింద భాగంలోని సైడ్ దిమ్మలు దెబ్బతినడంతో వాహనాలు వెళ్లే సమయంలో కదలికల శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు గుహలను దర్శించేందుకు వచ్చే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
TG: అమెరికాలో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ నగరం రామనాథపురి కాలనీకి చెందిన రాకేశ్(40) అమెరికాలో గుండెపోటుతో మరణించారు. రాకేశ్ ఉద్యోగ రీత్యా పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
AKP: సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. దివిస్ ల్యాబొరేటరీస్, యకోహామా టైర్స్, బ్లింకిట్ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 18–31 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంఎస్సీ, ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగులు సర్టిఫికెట్ జెరాక్సులతో హాజరుకావాలని కోరారు.
MDCL: పోచారం పరిధి అన్నోజిగూడ ప్రాంతంలో HIV-AIDS పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాజీవ్ గృహకల్పలో ఏకంగా ఇప్పటికే 30 మందికి పైగా పాజిటివ్ ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ సంబంధ కార్యక్రమాలతో అన్నోజిగూడ ప్రాంతంలోనూ AIDS విస్తరిస్తోంది. కాగా, ఓ మరదలుకు HIV రక్తం ఎక్కించిన ఘటన తెలిసిందే.
BHNG: ఆలేరు మండలం బహదూర్ పేట గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుళ్ల చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కర్రె సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా బిక్షపతి, కోశాధికారిగా బాలయ్య బాధితులు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా శేఖర్ వెంకటేష్ ఉన్నారు. ఈ ఎన్నికలు బీరప్ప గుడి ఆవరణంలో పెద్ద కురుమ ఐలయ్య, సిద్ధులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి భయంతో బయటకు రావాలంటేనే మహిళలు వణికిపోతున్నారు. పురపాలక అధికారులు తక్షణమే స్పందించి, ఈ కుక్కల సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని స్థానికులు కోరారు.
NLG: వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో నల్గొండ ఎండలతో మంటలెత్తుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరడంతో ఉక్కపోత తీవ్రంగా ఉంది. వేడి తట్టుకోలేక ప్రజలు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రకాశం బజార్, హైదరాబాద్ రోడ్ ప్రాంతాల్లో వారం రోజులుగా కూలర్లు, ఏసీల విక్రయాలు సుమారు 40 శాతం పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సోమవారం తెల్లవారుజామున 17వ వార్డులో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. రోడ్లపై ఉన్న చెత్తను వెంటనే తొలగించి కంపోస్ట్ యార్డుకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
VKB: పులుమద్దిలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వెల్చల్, ఎర్రవల్లి వంటి పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టడంతో దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన మొక్క జొన్న పంటలతో పాటు టమాటా, వంకాయ వంటి కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
VKB: జిల్లాలో గ్యాస్ సిలిండర్ కొరత లేదని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. విద్యాలయాలు, గృహాలు, ఆసుపత్రులకు ఎల్పీజీ గ్యాస్ సప్లై సరైన విధంగా సాగుతుందన్నారు. నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లకు తరలించి గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ దారి మళ్లింపును పర్యవేక్షించేందుకు ఐదు టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
SRCL: వీర్నపల్లి(M) వన్‌పల్లి, మద్దిమల్ల రూట్‌లో తిరిగే బస్సుల సమయాల్లో మార్పులు జరిగాయి. SRCL-VNPకు ఉదయం 5.40, 10.15, 11.00, 01.30, 3.15, 4.45, 8.15కు బయలు దేరుతుంది. అలాగే వన్‌పల్లి నుంచి 4.00, 7.00, 11.45, 1.15, 3.00, 5.00, 6.00లకు రిటర్న్ అవుతుంది. సిరిసిల్ల-మద్దిమల్లకు 6.00, 11.15లకు తిరిగి మద్దిమల్ల నుంచి 7.30 AM, 01.00PMకు బయలు దేరుతుంది.