• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పది’ విద్యార్థులతో కలెక్టర్‌ జూమ్‌ కాల్‌

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ అభిలాష అభినవ్‌ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. పరీక్షల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యంతో ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.

March 15, 2026 / 03:47 PM IST

విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలకు MLCకి ఆహ్వానం

ASF: కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని గోవర్ హెట్టి శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో మార్చి 22 నుంచి 24 వరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు MLC దండే విఠల్, మాజీ ZP ఛైర్మన్ గణపతితో పాటు పలువురు నేతలను నిర్వాహకులు ఆహ్వానించారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 15, 2026 / 03:46 PM IST

ముస్లిం మైనార్టీ మహిళలకు రంజాన్ కానుకలు అందజేత

SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ మహిళలకు మున్సిపల్ వైస్  ఛైర్మన్ దారం శంకర్ ఆదివారం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు మైనార్టీ మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2 వార్డు కౌన్సిలర్ సురేఖ, నాయకులు షరీఫ్ ఉన్నారు.

March 15, 2026 / 03:46 PM IST

లబ్ధిదారునికి LOC అందజేసిన కాంగ్రెస్ నాయకులు

JN: బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ జంగిటి లక్ష్మయ్యకు గుండె సంబంధిత వ్యాధి రావడంతో హైదరాబాదులో హాస్పిటల్లో చేరారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ LOC ద్వారా రూ.2, 50,000 మంజూరు చేయించారు. ఈ చెక్కును ఇవాళ లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు.

March 15, 2026 / 03:45 PM IST

అక్షరాస్యత పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

SKLM: ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలోని అరసవల్లి మున్సిపల్ హై స్కూల్లో అభ్యాసకులకు అక్షరాస్యత పరీక్షను అధికారులు ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శత శాతం అక్షరాస్యత లక్ష్యం అని అన్నారు.

March 15, 2026 / 03:44 PM IST

గ్యాస్ కొరతతో మండల ప్రజల ఇబ్బందులు

SRPT: అనంతగిరి మండలంలో వంట గ్యాస్ కొరతతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల బుక్ చేసిన సిలిండర్లు వారం రోజుల తర్వాతే డెలివరీ అవుతున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.965 ఉండగా, కొందరు రూ.1200-1500 వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

March 15, 2026 / 03:44 PM IST

చరిత్రలో YS వివేక హత్య దారుణ ఘటన: TDP ఇంఛార్జ్

KDP: పులివెందుల చరిత్రలో YS వివేకా హత్య దారుణ ఘటన అని TDP నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పులివెందులలో మాట్లాడుతూ.. ఆర్థికంగా డబ్బులు ఉండి వ్యవస్థలను మేనేజ్ చేసి తాత్కాలికంగా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ, ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఎప్పటికి తప్పించుకోలేరన్నారు. నేరస్తులు కర్మ సిద్ధాంతం ప్రకారం వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు.

March 15, 2026 / 03:43 PM IST

కాలం చెల్లిన వస్తువులు అమ్మితే కఠిన చర్యలు

KMM: వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు కోట వెంకట్, కన్నెపోగు వెంకటేశ్వర్లు (కెవిఆర్) కె ఆంజయ్యలు తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ వినియోగదారులు దినోత్సవం సందర్భంగా మధిర పట్టణంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలం చెల్లిన వస్తువులు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 15, 2026 / 03:40 PM IST

ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో మార్పులు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ విధానంలో మార్పులు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జనగణన-2027 శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ గదిలో స్వీకరించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

March 15, 2026 / 03:38 PM IST

జాతరలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక

SRD : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామంలో జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్నారు. గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

March 15, 2026 / 03:38 PM IST

బీజేపీలో చేరిన యువత

SKLM: టెక్కలి బీజేపీ కార్యాలయంలో టెక్కలి పట్టణానికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రాంజీ వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతుండటంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు.

March 15, 2026 / 03:37 PM IST

రూ. 5కే టమాటా.. బ్రిడ్జిపై పంట పారబోసిన రైతులు

GDWL: రాజోలి మండల కేంద్రంలో టమాటా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆదివారం మార్కెట్ లో కిలో టమాటా కేవలం రూ. 5 నుంచి రూ. 10 పలుకుతుండటంతో, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన కొందరు రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకెళ్లకుండా, మండల కేంద్రంలోని బ్రిడ్జిపై పారబోసి కోతులకు ఆహారంగా వదిలి వెళ్లారు.

March 15, 2026 / 03:37 PM IST

ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్టు స్వాగతిస్తా: KTR

TG: మాదకద్రవ్యాలు వాడితే రాజకీయాలకతీతంగా శిక్షలు పడాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. PCC చీఫ్ మహేష్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్టును స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ప్రతీసారి తన పేరు లాగితే చట్టపరంగా స్పందిస్తానని హెచ్చరించారు.

March 15, 2026 / 03:37 PM IST

ఈ చిట్కాలతో బ్లాక్ హెడ్స్‌కు చెక్!

కొన్ని చిట్కాలతో బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని ముక్కుపై రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కలిపి స్క్రబ్ చేస్తే రంధ్రాల్లో మురికిని తొలగిస్తుంది. వారానికి 2 సార్లు ఆవిరి పడితే మంచిది. మట్టి లేదా చార్కోల్ మాస్క్‌లు వాడితే నూనె, మురికి పోతాయి. రోజూ పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి.

March 15, 2026 / 03:34 PM IST

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వీరు గౌడ్ వివాహానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 03:32 PM IST