SRPT: అనంతగిరి మండలంలో వంట గ్యాస్ కొరతతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల బుక్ చేసిన సిలిండర్లు వారం రోజుల తర్వాతే డెలివరీ అవుతున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.965 ఉండగా, కొందరు రూ.1200-1500 వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.