HYD: చార్మినార్ నైట్ బజార్‌కు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. ఈ భారీ రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్‌కు వచ్చే వారు తమ నగదు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని మైకుల ద్వారా పోలీసులు నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు.
SKLM: రేపటి నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఇవాళ అధికారులు పర్యవేక్షించారు. జలుమూరు మండలం చల్లవానిపేట ZPHS, అరుణోదయ విద్యాలయ సంస్థ విజ్ఞాన్ దుర్గ హై స్కూల్ కేంద్రాలను ఎంపీడీవో బి.చిన్నముడు ఎన్‌జీవో బి.మాధవరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లేశ్వరరావు వెల్‌ఫేర్ అసిస్టెంట్ శంకర్రావు పాల్గొన్నారు.
విద్యార్థులకు మంచు మోహన్ బాబు కీలక సూచనలు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో అయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుసు. మా కాలంలో ఫోన్లు లేవు, కానీ ఇప్పుడు అందరి దగ్గర రెండేసి ఉంటున్నాయి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించి, ఆశయాలను నెరవేర్చి ప్రయోజకులు కావాలి’ అని హితవు పలికారు.
WGL: పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ బాజీ తండాకు చెందిన మాలోత్ పరమేష్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ కాపీని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందించి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అన్నమయ్య: తనపై వస్తున్న ఆరోపణలకు జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల మద్దతు పెరుగుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పనిచేస్తానని, తప్పుడు ఆరోపణలకు భయపడనని స్పష్టం చేశారు.
ATP: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు ఈ నెల 30న నిర్వహించే ఎస్సీ, ఎస్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ కోరారు. నార్పల మండలంలోని బి.పప్పూరు, గూగూడు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దళితులంతా ఏకమై శైలజానాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
NLG: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో ‘ప్రజాప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో వారి సేవలను గుర్తించి వారికి సబ్బులు, గ్లౌజులు, టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మాసారం అంబేద్కర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం తొత్తరమూడి పెదపాలెం గ్రామానికి చెందిన చిత్తూరి చాందిని గంగ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళంగా రూ.50,001లు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటం అందజేసారు.
TG: మోయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని పోలీసులు వదిలిపెట్టనున్నట్లు సమాచారం. అయితే, పాజిటివ్ వచ్చిన నలుగురికి నోటీసులు అందజేశారు. ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మను కోర్టులో హాజరుపర్చనున్నారు.
BHPL: భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామంలో సుంకరి సంతోష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదలకు గౌరవప్రద నివాసం కల్పించడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
BHNG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనరసయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, పాల్గొన్నారు.
BDK: మణుగూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ వర్కర్లకు కమిషనర్ శ్యామ్ పరిశుభ్రత కిట్లను ఇవాళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన 66 మంది మున్సిపల్ కార్మికులకు ఒక సంవత్సరానికి అవసరమైన పరిశుభ్రత వస్తువులను అందజేశారు.
AKP: పాయకరావుపేట మండలం నామవరం ‘అక్షరాంధ్ర’ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం కేంద్ర బృందం పరిశీలకుడు గగన్ కుమార్ కామత్ తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 3,534 మంది అభ్యాసకులు పరీక్ష రాస్తున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి ఆయనకు వివరించారు. 75 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో నానిబాబు, వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీలో వరుస బ్యాటరీల చోరీలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల–భువనగిరి రోడ్డులో పార్క్ చేసిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ బ్యాటరీతో పాటు, మరో ట్రాక్టర్ బ్యాటరీని శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CTR: వైసీపీ స్టేట్ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలను ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. స్టేట్ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పుంగనూరుకు చెందిన షేక్ రషీద బేగం, స్టేట్ బీసీ సెక్రటరీగా ఆనంద కుమార్, స్టేట్ ST జనరల్ సెక్రటరీగా మునీంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ క్రమంలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.