• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాదకద్రవ్యాలు మానవులను రాక్షసులుగా చేస్తాయి: KTR

TG: మాదకద్రవ్యాలు మానవులను రాక్షసులను చేస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా మాదకద్రవ్యాల వాడకాన్ని ఆశ్రయించడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. 

March 15, 2026 / 03:32 PM IST

మార్చి 15న తై బజార్ బహిరంగ వేలం

NRPT: మద్దూరు మున్సిపాలిటీలో ఈ ఆర్థిక సంవత్సరానికి తై బజార్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి 23 వరకు రూ. 5 లక్షల డిపాజిట్, రూ.1000 చలాన్ చెల్లించాలని సూచించారు. ఈ బహిరంగ వేలం మార్చి 25న మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతుందని వెల్లడించారు.

March 15, 2026 / 03:31 PM IST

త్రిపురాంతకంలో లారీ బోల్తా

ప్రకాశం: త్రిపురాంతకం(మం) కేశినేనిపల్లి వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. కేశినేనిపల్లి వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 03:31 PM IST

ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు

KNR: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 92వ జయంతి వేడుకలు చొప్పదండి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ వడ్లురి సరిత, వైస్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ళ మానస హాజరై మాట్లాడుతూ.. బహుజనుల ఐక్యతకు కృషి చేసిన గొప్ప నాయకుడు అని అన్నారు.

March 15, 2026 / 03:30 PM IST

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్..!

భారత క్రికెటర్ యశ్ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎటువంటి హడావిడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. గత నెలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. యశ్ దయాల్ తన SM ఖాతాల్లో పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఎక్కడా షేర్ చేయకపోవడం గమనార్హం.

March 15, 2026 / 03:29 PM IST

‘ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలి’

NRPT: ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలని వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు పిలుపునిచ్చారు. మక్తల్ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 2న పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

March 15, 2026 / 03:27 PM IST

గ్యాస్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు

CTR: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08572-242734కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని చెప్పారు.

March 15, 2026 / 03:27 PM IST

రేపు పుట్టపర్తిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 15, 2026 / 03:27 PM IST

ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పు: MEO

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేపటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి రత్నం తెలిపారు. మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ఏయిడేట్ ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఒంటిపూట బడులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 15, 2026 / 03:26 PM IST

బద్వేల్లో ప్లాస్టిక్ వినియోగంపై రైడ్..!

KDP: బద్వేల్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టణంలో శ్రీనివాసులు వ్యాపారి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించని బయో డిగ్రేడబుల్ వస్తువులను మాత్రమే విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు ఆ వ్యాపారిని కమిషనర్ సత్కరించారు.

March 15, 2026 / 03:26 PM IST

ఘనంగా కాన్షీరాం 92వ జయంతి వేడుకలు

BHPL: కాటారం మండల కేంద్రంలో ఆదివారం BSP వ్యవస్థాపకుడు కాన్షీరాం 92వ జయంతి వేడుకలు బహుజన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన నేతలు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ సడవలి మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో బహుజన నాయకులు ఉన్నారు.

March 15, 2026 / 03:25 PM IST

ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళం

కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చెందిన జవ్వాది సూర్యనారాయణమూర్తి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించున్నాడు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

March 15, 2026 / 03:25 PM IST

టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్త్: SP

అన్నమయ్య: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా SP ధీరజ్ తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో బందోబస్త్‌పై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరికి బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదన్నారు.

March 15, 2026 / 03:25 PM IST

రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్

KMM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం పేద కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ను కారేపల్లి జామే మస్జీద్ వద్ద పంపిణీ చేశారు. వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

March 15, 2026 / 03:25 PM IST

‘కొత్తపల్లెలో CMRF చెక్కులు పంపిణీ’

NDL: కొత్తపల్లె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. నాగంపల్లికి చెందిన చిన్న మస్తాన్‌కు రూ. 53,641, ఎర్రమఠం గ్రామానికి చెందిన మహేశ్వరయ్యకు రూ. 48,162, నందికుంటకు చెందిన దీపికకు రూ. 41,600 చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం అందజేశారు. అనంతరం లబ్ధిదారులు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

March 15, 2026 / 03:24 PM IST