అన్నమయ్య: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా SP ధీరజ్ తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో బందోబస్త్పై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరికి బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదన్నారు.