SKLM: జిల్లాలో మార్చి 16 నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో డ్రోన్లు, పెట్రోలింగ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఇప్పటికే అన్ని కేంద్రాలు పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.