BHPL: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నివాస సౌకర్యాలు, చిన్నారుల సంరక్షణ, పోషణ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఘనపూర్ మండలం మైలారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, అంగన్‌వాడీ భవనాన్ని ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో PR ఈఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.
TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డ్రగ్స్ టెస్టులు ముందుగా మనతోనే ప్రారంభిద్దాం. ముందుగా నేనే రక్త నమూనాలు ఇస్తా. అందరికీ డ్రగ్స్ టెస్టులు చేసి ముందుకు వెళ్లాలి. యువత కూడా ముందుకు రావాలి. డ్రగ్స్ తీసుకునేవాళ్లు భయపడేలా సీఎం చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్, కల్తీ లిక్కర్‌కు నేను వ్యతిరేకం’ అని పేర్కొన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం సిరికొండకు చెందిన భార్య భర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బద్దెనపల్లి నుంచి సిరికొండ వైపు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. వారిని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారన్నారు. చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని దాతలు సహాయం చేయాలని కోరారు.
పౌల్ట్రీ ఫారమ్లలో కోళ్లు త్వరగా పెరగడానికి వాడే మందుల ప్రభావం వాటి ఎముకలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే నాటుకోడిని తీసుకోవడం మేలు. ఇది కీళ్లనొప్పులను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్రాయిలర్ కన్నా నాటుకోడి ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన ఎంపిక.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే, తద్వారా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLG: విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ ఛైర్మెన్ బొల్గూరి ముకేశ్ తన పుట్టినరోజును ఆదివారం నార్కట్‌పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఆడంబరాలకు దూరంగా వృద్ధులకు అన్నదానం చేసి, వారితో సమయాన్ని గడిపారు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవలు చేస్తానని ముకేశ్ పేర్కొన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల(మం) మొగులూరుపల్లిలో ఆదివారం అక్షరాంధ్ర పరీక్ష నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు రాశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటరత్నం, డిప్యూటీ ఎంపీడీవో ఎస్.జీ.ఎస్.డబ్ల్యూ రాంప్రసాద్, వెలుగు సీసీ పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణను వారు పరిశీలించి, కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
WG: పేరుపాలెం బీచ్‌కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరి తోటల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకుని సరదాగా గడిపారు. పర్యాటకుల రాకతో తీర ప్రాంతంలో సందడి నెలకొంది.
NLR: మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘విదేశాలలో అమ్మాయిలతో జల్సా చేసిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా చేశారు. చదువుకోమని విదేశాలకు పంపిస్తే స్విమ్మింగ్ పూల్‌లో జల్సాలు చేసిన వ్యక్తిని భావితరాల విద్యార్థులకు మార్గదర్శకంగా చేశారు. అడ్డగోలుగా దోచుకోవడం కూటమి నాయకులకు అలవాటుగా మారింది’ అని మంత్రి లోకేష్‌ను పరోక్షంగా వివర్శించారు.
TG: సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. ఉద్యోగులను రోడ్డపైకి తెచ్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక చాలామంది చనిపోయారని వెల్లడించారు. వారి చావుకు రేవంతే కారణమని విమర్శించారు.
అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ మునియా నాయక్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. తెలుగు అధ్యాపకురాలు బి. శివమ్మ సమాజ అభివృద్ధిలో వినియోగదారుల చైతన్యం కీలకమని తెలిపారు.
నంద్యాల: సంపూర్ణ అక్షరాస్యత అందరి బాధ్యత అని, చదువుకున్న వారు చదువురాని వారికి చదువు నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పైడేల జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల మండలం కానాల, చాపిరేవుల గ్రామాల్లో అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పరీక్షల కేంద్రాలను డీఈవో జనార్ధన్ రెడ్డి తనిఖీ చేశారు.
VZM: జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశ్నాపత్రాలు తరిలించేటప్పుడు, భద్రపరిచేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 144 సి.ఆర్.పి.సి/163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందన్నారు.
BDK: జూలూరుపాడులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు సంతకాల సేకరణ ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో బీజేపీ శాసనసభ్యులు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన రైతు సంతకాలను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు.
JGL: దుకాణ యజమానులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ కటకం రవీందర్ అన్నారు. రాయికల్ పట్టణంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.