• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేసిన మహిళపై కేసు: ఎస్సై

WNP: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసిన మహిళపై కేసు నమోదు చేశామని రేవల్లి ఎస్సై రజిత తెలిపారు. డబ్బు ఇవ్వమని కోరిన శివలీల కొంత సమయ మిస్తే ఇస్తానని భాస్కర్ చెప్పగా వినకుండా ఇంటికి తాళం వేసి దూషించింది. బాధితుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటికి తాళం వేసిన మహిళపై పోలీసులు కసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 15, 2026 / 10:45 AM IST

మార్కెట్‌కు సెలవు.. కోట్లలో నిలిచిన వ్యాపారం

W.G: జిల్లాలో అతిపెద్ద వారపు సంత అయిన తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వర్తకులు సెలవు ప్రకటించారు. బలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఇవాళ సెలవు ప్రకటించామని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సుమారు 60 గ్రామాల వినియోగదారులు మార్కెట్‌కు నిత్యావసర వస్తువుల కోసం వస్తుంటారు. కాగా, ఇవాళ మార్కెట్‌లో రూ. 3కోట్ల వ్యాపారాం నిలిచిపోయినట్లు సమాచారం.

March 15, 2026 / 10:45 AM IST

నేటి మాంసం ధర ఎంతంటే..?

NLR: జిల్లాలో నేడు మాంసం ధరలు కాస్త పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.304, స్కిన్‌ లెస్ చికెన్ రూ.317, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

March 15, 2026 / 10:43 AM IST

పుంగనూరులో 10 వ తరగతి పరీక్ష కేంద్రాలు ఇవే..!

CTR: 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పుంగనూరులో ఈ ఏడాది 1512 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకు సంబంధించి 8 కేంద్రాలను కేటాయించారు. మేలుపట్ల హైస్కూల్, BRG-ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణ వీధిలోని ZP-బాలికొన్నత పాఠశాల, కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్, నారాయణ, బాష్యం, శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, ZP- ఉర్దూ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.

March 15, 2026 / 10:43 AM IST

‘తాగునీటి సమస్య పరిష్కరించండి’

SKLM: సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో జల్ మిషన్ పథకం పూర్తి కాకపోవడంతో గ్రామంలో తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తుల ఆందోళన చెందారు. గ్రామంలో తాగునీటి కోసం ఎటువంటి సౌకర్యాలు లేవని ప్రభుత్వం ఈ పథకాన్ని మంజూరు చేయడం ఎంతో ఆనంద వ్యక్తపరిచామని.. అయితే ఏళ్లు గడుస్తున్న నిర్మాణం పూర్తి కాకపోవడం ప్రజల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

March 15, 2026 / 10:43 AM IST

జిల్లాలో 1000 సంవత్సరాల శిలాశాసనం ఎక్కడంటే..?

ప్రకాశం: మర్రిపూడి మండలంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. శనివారం ఆర్కాలజీ అధికారులు సన్నుమూరు సమీపంలోని శివాలయం వద్ద ఈ శాసనాన్ని గుర్తించారు. ఎంతో చరిత్ర కలిగిన శాసనం బయటపడటంతో స్థానిక గ్రామస్తులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ శాసనాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నట్లు పరిశోధకుడు నాగిరెడ్డి తెలిపారు.

March 15, 2026 / 10:42 AM IST

కేయూ మాజీ వీసీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

HNK: కేయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లింగమూర్తి అనారోగ్యంతో మరణించగా భీమారం బ్యాంక్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి లింగమూర్తి పార్థివదేహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

March 15, 2026 / 10:40 AM IST

CBI సొంతంగా ఆలోచించదా?: YS సునీత

AP: ‘మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులు చెప్పినది వినడమే CBI పనా? సొంతంగా ఆలోచించదా?’ అని ఆయన కూతురు YS సునీత ప్రశ్నించారు. వివేకా వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఆమె.. వివేక చనిపోయారని YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ అర్జున్ రెడ్డికి A2 కిరణ్ యాదవ్ మేసేజ్ పంపారని, నాటి రాత్రి తన ఇంట్లోనే ఉన్న వ్యక్తికి వివేకా చనిపోయారని ఎలా తెలిసిందని నిలదీశారు.

March 15, 2026 / 10:39 AM IST

KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల..!

HNK: KU పరీక్షల డిగ్రీ II, IV, VI సెమిస్టర్ల (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు ఫీజు చెల్లింపు చివరి తేదీ ఏప్రిల్ 4గా నిర్ణయించారు. రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణకు ఏప్రిల్ 6 వరకు గడువు, లేట్ ఫీజుతో ఏప్రిల్ 10 వరకు అవకాశం ఇచ్చారు.

March 15, 2026 / 10:38 AM IST

ఫుల్ స్వింగ్‌లో ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం 2026 ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

March 15, 2026 / 10:36 AM IST

మరణం లోను మరో ఇద్దరికి నేత్రదానం

PDPL: గోదావరిఖని మేదర్ బస్తికి చెందిన పిల్లి కుమార్ (45) మరణించగా కుటుంబసభ్యుల అంగీకారం మేరకు LV ప్రసాద్ ఐ ఆసుపత్రి ఐ బ్యాంక్‌కు శనివారం నేత్రదానం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించడం పట్ల పలువురు ఆ వారిని అభినందించారు. ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని నేత్రాలను సేకరించారు.

March 15, 2026 / 10:35 AM IST

రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: గుడిహాత్నూర్ మండలంలోని తోషం – తోయగూడ రోడ్డు నిర్మాణానికి ఆదిలాబాద్ ఎంపీ నగేష్‌తో కలిసి ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. 1 కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 10:35 AM IST

అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మృతి.

మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పాత రెల్లి వీధిలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మంటలు అంటుకోవడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు బెహరా గొల్ల (55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 10:35 AM IST

మొక్కలు నాటి.. అడ్డుగా వచ్చాయని నరికేస్తారు!

VKB: ధారూర్ మండల అభివృద్ధి అధికారులు మొక్కలు నాటిస్తారు.. విద్యుత్ శాఖ అధికారులు నరికేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఏటా లక్షల్లో మొక్కలు నాటుతారు. వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత విద్యుత్ తీగలకు అడ్డంకిగా మరుతున్నాయన్న సాకుతో వాటిని నరికి వేస్తున్నారు. మొక్కలు నాటే ముందు సంబధిత అధికారులు చర్యలు తీసుకుంటే సరిపోతుందని స్థానికులు సూచిస్తున్నారు.

March 15, 2026 / 10:31 AM IST

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

SDPT: మిరుదొడ్డి మండలంలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అందే గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు దుబ్బాక రూరల్ మండలంలోని పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది.

March 15, 2026 / 10:30 AM IST