పల్నాడు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 278, స్కిన్‌లెస్ చికెన్ రూ. 317, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ. 900-1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
PPM: తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గల మొక్కజొన్న, అరటి తోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
KDP: ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీర గంగమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వార్షిక మహోత్సవాల్లో ఆఖరి 3వ రోజు బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ పోటీలను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరగనుంది.
BPT: కర్లపాలెంలోని ‘వజ్రపహార్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ వెల్లడించారు. 39 మంది పోలీసు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన కపిల్ అనే వ్యక్తి మద్యం మత్తులో బీర్ బాటిల్‌తో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడుపులో తీవ్ర గాయమైన అతడిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది కిషన్, ముజఫర్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబూ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ మన్సు రుద్దీన్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగం నియంత్రిస్తూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
NZB: పోతంగల్ మండలం హంగర్‌గా ఫారానికి చెందిన కుంటను రమ(30) అనే మహిళ శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త మద్యానికి బానిసై పనికి వెళ్లకపోవడంతో కుటుంబ పోషణ భారమై, మనస్తాపంతో ఈనెల 12న ఆమె పురుగు మందు తాగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
BHPL: మహదేవపూర్(M)సూరారంలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. SI పవన్ కుమార్ వివరాల ప్రకారం.. ఓ ఇంట్లో అక్రమంగా JCBతో తవ్వకాలు చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు చేయడం నేరమని అన్నారు.
AP: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఉద్యోగుల నుంచి PRCపై ఆందోళన వ్యక్తమవుతోందని, రెండేళ్లైనా IR ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. బకాయిల ఊసేలేదని, సరెండర్ లీవ్స్, DAలు పెండింగ్‌లో ఉన్నాయని.. ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
CTR: టమాటాకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 30 కిలోల టమాటా ట్రే రూ. 200 తిరుపతి మార్కెట్‌లో పోతుండడంతో గిట్టుబాటు ధర లేదని రైతులు విలపిస్తున్నారు. మూరేవాళ్లపల్లికి చెందిన రైతు కోదండరామిరెడ్డి రూ. 6 లక్షలు ఖర్చుపెట్టి 2 1/2 ఎకరా టమాటా సాగు చేశాడు. ట్రే రూ. 200 అమ్మితే ఖర్చులు పోను రూ. 70 చేతికి వస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
MDK: కుల్చారం మండలం రాంపూర్ వద్ద నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొట్టెల వేడుకకు వెళ్లి బైక్‌పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో అమృత్ గౌడ్(50), ఆయన కుమారుడు రిషివర్ధన్ (14), అల్లుడు సాయాగౌడ్(32) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రిషివర్ధన్ పుట్టినరోజు వేడుకలు మొన్ననే జరుపుకోగా, మరుసటి రోజే విగతజీవిగా మారడంతో తల్లి యాదమ్మ రోదనలు మిన్నంటాయి.
GDWL: మల్దకల్ మండలం ఎల్కూరు శివారులోని కల్వర్టు రక్షణ గోడలు కూలిపోయి ప్రమాదకరంగా మారాయి. వంతెనపై ఇనుప ఊచలు బయటకు రావడంతో వాహనదారులు, రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రక్షణ గోడలు నిర్మించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
NLG: చండూరులో వాతావరణం ఒక్కసారిగా మారింది. రెండు రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ ఉదయం దట్టమైన మంచు కురవడం ఆశ్చర్యం కలిగించింది. తెల్లవారుజాము నుంచే మండలవ్యాప్తంగా మంచు దుప్పటి పరుచుకుంది. వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.
SKLM: మెలియాపుట్టి మండల పట్టు పురంలో ఎస్సై మహ్మద్ అమీర్ ఆలీ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు చాపర గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్ ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తీసుకెళ్తుండగా, అతనిని తనిఖీ చేయగా 36 మద్యం సీసాలు అతని నుంచి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
W.G: విద్యార్థులు పరీక్షల్లో సత్ఫలితాలు సాధించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఉద్యోగి రుద్రరాజు బలరామరాజు రూ.3 లక్షల సొంత వ్యయంతో నిర్మించిన యోగా శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు రోజూ అరగంట పాటు యోగా సాధన చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని మంత్రి సూచించారు.