• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 మందికి జరిమానాలు: ఎస్సై

PPM: ఇటీవల మక్కువ మండలంలో చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన 7 గురిని శనివారం సాలూరు కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు కోర్టు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.70 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ చేసి పట్టుబడితే జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుందని హెచ్చరించారు.

March 15, 2026 / 06:18 AM IST

ఆరుట్లలో ఘనంగా ఇఫ్తార్ విందు!

RR: మంచాల మండలం ఆరుట్లలో ముస్లిం సోదరులకు మార్కెట్ కమిటీ సభ్యులు సాత్రి ఎలిషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారని, ఇవి సమాజానికి మేలు చేకూరుస్తాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులంతా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

March 15, 2026 / 06:18 AM IST

హోటళ్లపై దాడులు.. 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

కృష్ణా: పెనమలూరు(M)లోని పోరంకి, కానూరు ప్రాంతాల్లో టిఫిన్ హోటళ్లు, స్వీట్ షాపులపై శనివారం అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. పెనమలూరు, గుడివాడ, మొవ్వ, గన్నవరం, మచిలీపట్నం ప్రాంతాల PDS DTలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా గృహ వినియోగానికి కేటాయించిన 41 గ్యాస్ సిలిండర్లు వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

March 15, 2026 / 06:18 AM IST

94,481 కేసులకు పరిష్కారం

KDP: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 94,481 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. కడపలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. పరిష్కారమైన కేసులకు సంబంధించి రూ.3,52,00,000 మేర కక్షిదారులకు చెల్లించాలని ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

March 15, 2026 / 06:16 AM IST

తాబేళ్ల సంరక్షణలో ఇంక్యుబేషన్ సెంటర్ల పాత్ర కీలకం: కలెక్టర్

కోనసీమ: నేలరేవు, గచ్చకాయలపొర, వాసాల తిప్ప సముద్ర తీర ప్రాంతంలో 50వేలు గుడ్లు సేకరించి ఇంక్యుబేషన్ సెంటర్‌లో 45 రోజులు భద్రపరచగా.. తొలి దశలో 300 తాబేలు పిల్లలు జన్మించాయి.వాటిని గచ్చకాయలపొర వద్ద సముద్రంలో విడిచిపెట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. సముద్రపు తాబేళ్ల సంరక్షణలో ఇంక్యు బేషన్ సెంటర్ల పాత్ర చాలా కీలకమని కలెక్టర్ తెలిపారు.

March 15, 2026 / 06:15 AM IST

గూగుల్ డేటా సెంట‌ర్‌కు వ‌చ్చే నెలలోనే శంకుస్థాపన

VSP: ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలవనుండగా, వచ్చే నెల మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. కొమ్మాదిలోని ఓ కళాశాల వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సెంటర్ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

March 15, 2026 / 06:15 AM IST

‘విద్యుత్ సౌకర్యం కల్పించడం పట్ల గ్రామస్తుల హర్షం’

ADB: భీంపూర్ మండలంలోని జెండాగూడ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా విద్యుత్తు సౌకర్యం లేక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు చౌహన్, రాథోడ్ శేష రావు, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 06:15 AM IST

వసతి గృహాల నిర్మాణానికి విరాళం

NDL: పాణ్యం మండల పరిధిలో వెలసిన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వసతి గృహాల నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు. శనివారం ఆలయ ఈవో రామకృష్ణ మాట్లాడుతూ.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన చంద్రమౌళి-నాగలక్ష్మి దంపతులు వసతి గదుల నిర్మాణానికి ఈ విరాళం అందించారన్నారు. దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 15, 2026 / 06:14 AM IST

‘పదో తరగతి పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి’

AKP: జిల్లాలో రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. 21,016 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి 102 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

March 15, 2026 / 06:14 AM IST

టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్

NTR: విజయవాడ జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో గృహాలను కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది నాటికి లబ్ధిదారులు కొత్త ఇళ్లలో గృహప్రవేశం చేసుకునేందుకు జక్కంపూడిలో నిర్మించిన 2,256 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులు ఇళ్లల్లోకి ప్రవేశించే సమయానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.

March 15, 2026 / 06:13 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న శాప్ ఛైర్మన్

TPT: తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఇఫ్తార్ విందులో శాప్ ఛైర్మన్ రవి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 15, 2026 / 06:12 AM IST

నేడు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇవాళ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయని తెలిపారు.

March 15, 2026 / 06:11 AM IST

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: మంత్రి

E.G: నిడదవోలు రోటరీ క్లబ్‌లో శనివారం రాత్రి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ దావత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై, ముస్లింలతో కలిసి సామూహిక విందులో పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, మతసామరస్యానికి ఇఫ్తార్ వేడుకలు ప్రతీక అని కొనియాడారు.

March 15, 2026 / 06:10 AM IST

నేడు కొణిజర్ల మండలంలో మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కొణిజర్ల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అంజనాపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారన్నారు.

March 15, 2026 / 06:10 AM IST

కొత్త తరహా దొంగతనాలు

NLR : ఓ పక్క యుద్ధం ఎఫెక్ట్ తో వంటగ్యాస్ దొరకక ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే అదునుగా చూసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను దొంగలించడమే పనిగా పెట్టుకున్నారు. బుచ్చి పట్టణం ఖాజా నగర్‌లోని 3 నివాసాలలో మూడు సిలిండర్లు చోరీ చేసిన ఘటన తెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని వెళ్లారని బాధితులు వాపోతున్నారు.

March 15, 2026 / 06:09 AM IST