VSP: ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలవనుండగా, వచ్చే నెల మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. కొమ్మాదిలోని ఓ కళాశాల వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సెంటర్ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.