ADB: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో మేనేజర్ విధులు నిర్వహిస్తున్న శ్యామల అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని శనివారం అవార్డును పొందారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న కృషికి గాను ఈ అవార్డును అందుకున్నట్లు ఆమె తెలిపారు.