JGL: సెర్వికల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి బాలికలను రక్షించేందుకు 13 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఉప వైద్యాధికారి డా.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.