ATP: గుమ్మగట్ట డిప్యూటీ ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ లాడ్జీలో గుండెపోటుతో మరణించారు. శిక్షణ నిమిత్తం అక్కడికి వెళ్లిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వజ్రకరూరుకు చెందిన చంద్రశేఖర్ విధి నిర్వహణలో చురుగ్గా ఉండే అధికారి అని, ఆయన మరణం తీరని లోటని తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.