PPM: ఇటీవల మక్కువ మండలంలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 7 గురిని శనివారం సాలూరు కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు కోర్టు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.70 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడితే జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుందని హెచ్చరించారు.