WGL: నర్సంపేట పట్టణంలో బుధవారం నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రకు హాజరుకావాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి బజరంగ్ దళ్ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.