NLG: పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న గోపాల మిత్రులకు కనీస వేతనం ఇవ్వాలని మంగళవారం గోపాల మిత్రల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ.. గోపాల మిత్రులను ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ పరంగా గుర్తింపు ఇవ్వాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.