AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కడపలోని ఒంటిమిట్టకు చేరుకుని, శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.