CTR: బంగారుపాలెం మండలం, శెట్టేరి గ్రామంలో రేపు ఉదయం 8:00 గంటలకు MLA డా. కలికిరి మురళీ మోహన్ పాల్గొని ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో, ప్రజల వినతిని పూరించడానికి APSRTC బస్సు సర్వీస్ ప్రారంభోత్సవం కూడా నిర్వహిస్తారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.