E.G: నిడదవోలు రోటరీ క్లబ్లో శనివారం రాత్రి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ దావత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై, ముస్లింలతో కలిసి సామూహిక విందులో పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, మతసామరస్యానికి ఇఫ్తార్ వేడుకలు ప్రతీక అని కొనియాడారు.