కాన్షీరాం.. రాజకీయ నేత. పంజాబ్ ఖవాస్‌పూర్ గ్రామంలో జన్మించారు. వెనకబడిన వర్గాల రాజకీయ చైతన్యానికి ఎంతో కృషి చేశారు. అంబేద్కర్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. వివక్షకు వ్యతిరేకంగా, బహుజనుల సాధికారత కోసం ఎంతో కృషి చేశారు. 1984లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి 85 శాతం ఉన్న బహుజనులను ఏకం చేశారు. UP సీఎంగా మాయవతిని చేసి దళిత రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చారు.
KRNL: విద్యుత్ బిల్లుల పేరుతో వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని, విద్యుత్ సేవల సమాచారం అధికారిక మార్గాల్లోనే అందుతుందని పేర్కొన్నారు.
TG: ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.
AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు జాగారం సందర్భంగా ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన గరగల ఊరేగింపు పట్టణ వీధుల గుండా భక్తి పరవశంలో సాగింది. డప్పుల మోగింపు, కోలాట నృత్యాలతో సందడి నెలకొంది. భక్తులు పసుపు నీళ్లతో అర్ఘ్యమిస్తూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. కాగా, ఈ నెల 17న పెద్ద జాగారం, 18న ప్రధాన జాతర నిర్వహించనున్నారు.
1564: జిజియా పన్ను రద్దు1767: అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ జననం1934: ప్రముఖ దళిత నేత కాన్షీరాం జననం1950: భారత ప్రణళికా సంఘం ఏర్పాటైన రోజు1977: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననంప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
AP: పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జోస్యం చెప్పారు. నియోజకవర్గానికి ఆయన చేస్తున్న అభివృద్ధే అందుకు తార్కాణమని పేర్కొన్నారు. పిఠాపురంలో ఇప్పటికే 60 వేల మందితో జనసేన ఒక పెద్ద కుటుంబంగా మారిందన్నారు. పవన్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదని.. దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు.
AP: నెల్లూరు జిల్లా అల్లూరు TDP కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీడీపీ ఆఫీసు పూర్తి కాలి బూడిదైంది. పార్టీ ఆఫీసులో అగ్నిప్రమాదంపై TDP నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరోచోట పార్టీ ఆఫీసును MLA అనుచరులు ప్రారంభించారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా నిప్పంటించారా అన్న కోణంలో అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
AP: భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. నేరెళ్లవలస నుంచి కొత్తవలస, బోయపాలెం, కాపులుప్పాడ రోడ్డును, భీమిలి నుంచి దొరతోట జంక్షన్‌కు వెళ్లే రోడ్డును పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం నాటికి మాస్టర్‌ప్లాన్ రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
TG: మూసీ నది మురికిగా మారడంతో భూగర్భజలాలు కలుషితమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తద్వారా నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మూసీ ప్రక్షాళన చేపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఈగల్ టీమ్ దాడులు చేస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో రెండు గ్రాముల కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు. సోదాల సమయంలో మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్‌లో జరుగుతున్న పార్టీలో ఏపీకి చెందిన ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.
PPM: ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు అన్నారు. వాహనదారులకు ప్లకార్డులతో హెల్మెట్ దారులుతో అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారిలో బయటకు వస్తే తప్పనిసరిగా ఎలిమెంట్ ధరించాలని నిర్లక్ష్యం కారణంగా వారి కుటుంబాలు వీధిని పడకూడదు అన్నారు.
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులను శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ఈవో జె. వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు జెమిని ఏఐతో కలిసి మీకు ఒక స్నేహితుడిలా మారనుంది. ఇకపై మీరు మ్యాప్స్‌తో నేరుగా మాట్లాడవచ్చు. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు ఇది ఖచ్చితమైన సమాధానమిస్తుంది. అలాగే ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ద్వారా వెళ్లే దారిని 3D రూపంలో, భవనాలు, ఫ్లై ఓవర్లతో సహా కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.