• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కమల్‌హాసన్‌పై చిన్మయి తీవ్ర విమర్శలు

తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడంపై కమల్‌హాసన్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి, కమల్ స్పందనపై తీవ్రంగా మండిపడింది. బాధితుల పక్షాన నిలవాల్సిన వారు ఇలా వేధింపుల ఆరోపణలు ఎదర్కొనే వ్యక్తిని అభినందించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

March 14, 2026 / 09:14 PM IST

‘కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే నన్ను పోషించారు’

మొదటి సినిమా ‘షాక్’ ఫ్లాప్ అయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ తనను రెండేళ్లు పోషించారని దర్శకుడు హరీష్ శంకర్ గుర్తుచేసుకున్నాడు. ‘రామ్ చరణ్‌ను పరిచయం చేస్తున్నాం, నువ్వు నాతో ఉండు’ అని పూరి అండగా నిలిచారని తెలిపాడు. రైటర్‌గా తనకు గుర్తింపునిచ్చి, ఆర్థికంగా ఆదుకున్నారని.. పూరి వద్ద పనిచేయడం ‘పెయిడ్ ఇంటర్న్‌షిప్’ లాంటిదని హరీష్ ఉద్వేగంగా చె...

March 14, 2026 / 09:06 PM IST

ప్రేమను చెబితే దూరం అవుతుందనే భయమా?

అతిగా ప్రేమించే వ్యక్తికి మనసులోని మాట చెబితే, ఎక్కడ ఉన్న స్నేహం కూడా విడిపోతుందోననే భయం చాలామందిని వేధిస్తుంది. అయితే, నిజమైన ప్రేమను వ్యక్తపరచకుండా దాచుకోవడం వల్ల కాలక్రమేణా పశ్చాత్తాపం మిగిలే అవకాశం ఉంది. అందుకే, సరైన సమయంలో నిజాయితీగా వ్యక్తపరచడమే మేలు. ఫలితం ఏదైనా, ఆ స్పష్టత మీ మనసులోని భారాన్ని తగ్గించి భవిష్యత్తుపై ధైర్యాన్ని ఇస్తుంది.

March 14, 2026 / 09:02 PM IST

రేపు YS షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

PPM: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్వతిపురంలో విలేకరులతో మాట్లాడారు. రేపు కొమరాడ మండలం డంగ భద్రలో ఆమె పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు.

March 14, 2026 / 09:00 PM IST

రేపు YS షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

PPM: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్వతిపురంలో విలేకరులతో మాట్లాడారు. రేపు కొమరాడ మండలం డంగ భద్రలో ఆమె పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు.

March 14, 2026 / 09:00 PM IST

సింగరేణిలో ముస్లిం ఉద్యోగులకు రంజాన్ అడ్వాన్స్

MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థలో ముస్లీం ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12, 500 అడ్వాన్స్ కింద ఈ నెల 18న బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ అడ్వాన్స్ ఏప్రిల్ నెల వేతనాల నుంచి 10 సమాన నెలవారీ వాయిదాల్లో రికవరీ కానుంది.

March 14, 2026 / 09:00 PM IST

బండి సంజయ్ పాదయాత్రకు ముస్లింల ఘన స్వాగతం

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్రకు ముస్లింలు ఘనస్వాగతం పలికారు. ‘అంజన్న ఆశీర్వాద పాదయాత్ర’ గంగాధర మండల శివారులోని తుర్కశి నగర్‌కు చేరుకోగానే ముస్లింలు ఆయనకు శాలువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. వారితో కాసేపు ముచ్చటించిన బండి సంజయ్.. అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

March 14, 2026 / 09:00 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

ASR: ఉద్యోగ భద్రత కల్పించి ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ పోస్టుల్లో రెగ్యులర్ చేయాలని గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. శనివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు.10–20 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. సమస్యను ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

March 14, 2026 / 09:00 PM IST

ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీక: MLA

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జంషెడ్ బేగ్ పెట్ గ్రామంలోని మస్జిద్‌లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో MLA గండ్ర సత్య నారాయణరావు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు రహీమ్, షఫీ, హమీద్, సలీం, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ ఓం ప్రకాష్ ఉన్నారు.

March 14, 2026 / 08:55 PM IST

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్

NGKL: లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పాయిపల్లి గ్రామానికి చెందిన మూడవత్ తులసిరామ్ తన ట్రాక్టర్ ద్వారా సమీపంలోని వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

March 14, 2026 / 08:55 PM IST

మానుకోటలో ఘనంగా గౌడ ప్రజా ప్రతినిధుల సన్మానోత్సవం

MHBD: జిల్లాలో కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కుల ప్రజాప్రతినిధుల సన్మానమహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గౌడయువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ అద్యక్షతన జరిగిన ఈ సన్మానోత్సవంలో హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ ప్రజా ప్రతినిధులను సన్మానించారు. గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.

March 14, 2026 / 08:54 PM IST

‘అప్పులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది’

AP: కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్ని ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు. ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు విచ్చలవిడిగా అప్పలు తెచ్చారని ఆరోపించారు.

March 14, 2026 / 08:54 PM IST

మాజీ వైస్ ఛాన్సలర్ భౌతిక దేహానికి నివాళులర్పించిన MLA

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు భీమారం బ్యాంకు కాలనీలోని మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

March 14, 2026 / 08:51 PM IST

సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచిత సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో మూడు గ్రామాలు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.

March 14, 2026 / 08:50 PM IST

‘ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు’

WNP: పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదర భావానికి ప్రత్యేకంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. శనివారం జిల్లాలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 08:49 PM IST