NLG: నార్కట్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్ రావు తెలిపారు. పట్టణంలో రోడ్డు వెడల్పు పనులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ తీగల మార్పిడి పనులు చేపడుతున్నందున తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతవరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, నిన్న కామారెడ్డి, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.
AKP: లాభదాయకమైన ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జి సూచించారు. సోమవారం సబ్బవరం మండలం అమృతపురంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.
VSP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సత్యసాయిబాబా బోధించిన మత సామరస్య సందేశాన్ని స్మరించుకుంటూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమసదన్‌లో ముస్లిం సోదరులకు సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యర్రమంలో తారా, మొహమ్మదియా, ఆల్ మదీనా మసీదులకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు.
VSP: ఆర్కే బీచ్ వద్ద పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారు హారం, సెల్‌ఫోన్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను 3 టౌన్ పోలీసులు గంటలోపే గుర్తించారు. పాలకొండకు చెందిన మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ ఎక్స్‌పో ప్రాంతంలో బ్యాగ్‌ను పోలీసులు గుర్తించి యజమానికి అప్పగించారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞత తెలిపారు.
ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించాలని తాను కోరుకున్నట్లు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తెలిపింది. ఇప్పుడు తన కల నెరవేరినట్లు చెప్పింది. గత రెండేళ్లలో భారత పురుషులు, మహిళల జట్లతో పాటు అండర్-19 జట్లు కూడా సత్తా చాటాయని పేర్కొంది. భారత క్రికెట్ ఇలా ఎదగడం చాలా గర్వంగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.
KRNL: మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఊరు కొండపై వెలసిన శ్రీశ్రీ తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 19న గ్రామ దేవుళ్లకు నైవేద్యం సమర్పణ, 20న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కుందేలు పారి వేట, సాంస్కృతిక కార్యక్రమం, 21న వసంతోత్సవం జరుగునున్నట్లు చెప్పారు.
కాకినాడ: జిల్లాలోని పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి ఈ స్థానాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్ఠంగా ఆరు నెలల పాటు అధికారుల పాలనలోనే పురపాలన కొనసాగనుంది.
కృష్ణా: పోరంకిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిగడప నుంచి పోరంకి వైపు వెళుతున్న కారు త్రినేత్ర హాస్పటల్ వద్ద పోరంకి గ్రామానికి చెందిన అలివేలు మంగమ్మ (79), కుమార్తె నాగ శిరోమణిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా, వారిని వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలివేలు మంగమ్మ మృతి చెందారు. నాగ శిరోమణి ఆరోగ్యం నిలకడగా ఉంది.
SKLM: సోషల్ మీడియా దుర్వినియోగం తీవ్రమైన నేరమని డీఎస్పీ వివేకానంద అన్నారు. సోమవారం మునసబు పేటలోని గురజాడ కళాశాలలో సోషల్ మీడియా దుర్వినియోగం అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ మార్ఫింగ్, ఆన్‌లైన్ వేధింపులు వంటి చర్యలు చట్టపరమైన నేరాలు అని అన్నారు. అనుమానాస్పద సందేశాలు వస్తే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
WGL: నగరంలోని CKM ఆసుపత్రిని సిబ్బంది కమర్షియల్‌గా మార్చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని సర్కార్ ఆదేశించగా, దానికి భిన్నంగా ఉందని అన్నారు. 6 ఆర్ఎంవోలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకపోవడం వలన సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి రోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి మృతి చెందడంతో తల్లి వద్ద ఉంటున్న బాలికపై బంధువైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
మార్జరి ఆసనం(పిల్లి భంగిమ) వెన్నెముకను సాగదీయడం, దాని సౌలభ్యాన్ని పెంచుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలపై మసాజ్ లాగా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత వెన్నునొప్పిని తగ్గించడానికి, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.
అన్నమయ్య: రాయచోటి న్యాయవాదుల సంఘం 2026-27 సంవత్సరానికి ఈనెల 28న జరగనున్న ఎన్నికల కోసం సోమవారం 11 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి పి. రెడ్డయ్య తెలిపారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించి, బుధవారం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు.
NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆచ్చెంనాయుడు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తానని అన్నారు. మే 15వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.